Categories: FeaturedMovie News

సూపర్ స్టార్ కృష్ణతో కెరీర్ మొదలు పెట్టిన ఈ అందగాడు ఏమయిపోయాడు?

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి చివరికి అనామకంగా జీవితం గడిపిన వారు ఎన్నో ఎందరో. సినీ పరిశ్రమకి దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలన్న సామెత కరెక్టుగా సరిపోతుంది. అవును హిట్లు వస్తేనే ప్రజలు అభిమానిస్తారు. లేదా పాతాళానికి తొక్కి వేస్తారు. ఇలాంటి జీవితమే అలనాటి తెలుగు హీరో రామ్మోహన్ కు జరిగింది. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం అంతా సవ్యంగా ఉంది అన్న సమయంలో సినిమాల్లో నటించాలన్న కోరిక అతని జీవితాన్ని తలకిందులు చేసింది.

సినిమాల్లో నటించాలన్న కోరిక తో తాను విమానాశ్రయంలో చేస్తున్న పెద్ద అధికారి పోస్టును సైతం వదిలేసి సినిమాల్లోకి ప్రవేశించాడు. ఆదిత్య సుబ్బారావు నిర్మించిన తేనెమనసులు సినిమాతో రామ్మోహన్ సినిమా కెరీర్ ని మొదలు పెట్టాడు. తేనె మనసులు సినిమాలో రామ్మోహన్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా తన నటనా జీవితాన్ని మొదలుపెట్టారు. రామ్మోహన్ ని అభిమానులు ఆంధ్ర దేవానంద్ గా ముద్దుగా పిలుచుకునేవారు. ఆయన పర్సనాలిటీ, ఆయనలోని యాక్టింగ్ పూర్తిగా దేవానంద్ ను గుర్తు చేసేలా ఉంటుందని అభిమానులు చెబుతుంటారు.

సినీ పరిశ్రమలో అప్రమత్తంగా ఉండకపోతే జీవితాలు తలకిందులవుతాయాంటే అనేదానికి రామ్మోహన్ జీవితం కూడా ఒక ఉదాహరణ. ఇకపోతే రామ్మోహన్ సినీ జీవితంలో దాదాపు 25 సినిమాలు హీరోగా నటించాడు. సినిమాల్లో హీరోగా నటించడం అంటే అంత సులువైన విషయం కాదు కదా.. 25 సినిమాల్లో హీరోగా నటించిన రామ్మోహన్ ఆర్థికంగా బాగానే కుదురుకున్నారు. అప్పట్లో రామ్ మోహన్, సూపర్ స్టార్ కృష్ణతో కలిసి మూగమనసులు సినిమాలో సినీ జీవితాన్ని ప్రారంభించిన సమయంలో అనేక సూపర్ హిట్ సినిమాలు చేయడంతో ఇక తనకు తిరుగులేదని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత తన తమ్ముడు, తన స్నేహితుల చెడు మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నువ్వు ఇంత పెద్ద హీరో నువ్వు సినిమా షూటింగ్ సమయానికి వెళితే నీ గొప్ప ఏముంటుంది అంటూ అతనిని రెచ్చగొట్టారు. ఆ మాయ మాటలు విన్న రామ్ మోహన్ సినిమా షూటింగ్ రోజులలో అసలు ఆ రోజు షూటింగ్ కి వస్తారా…? లేరా అన్నట్టుగా తనకు ఇష్టం వచ్చిన సమయంలో వచ్చేవారు. దీంతో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో ఉండాల్సిన సమయపాలన రామ్మోహన్ గాలికి వదిలేశాడు.

ఇంకేముంది ఇండస్ట్రీ కూడా అతన్ని గాలికి వదిలేసింది. ఇక అప్పటి నుండి రామ్మోహన్ సినీ జీవితం మారింది. దీంతో అతనికి సినిమాలు లేవు. సంపాదన లేదు. ఇంకేముంది తన స్నేహితులు కూడా రావడం మానేశారు. సినిమాల్లో ఛాన్స్ వచ్చింది కదా అని విమాన రంగంలో మేనేజర్ స్థాయి ఉద్యోగాన్ని కూడా వదులుకుని వచ్చిన సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఓ వెలుగు వెలిగి చివరికి రోడ్డున పడాల్సి వచ్చింది. బాగా చదువుకున్న వాడు కాబట్టి హైదరాబాద్ కు చేరుకుని మళ్ళీ ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు. అయితే ఆ సమయంలో పిల్లలకు ట్యూషన్ చెప్పాడు.

ఆ తర్వాత అతనికి ఎలాంటి ఉద్యోగం దొరక్క పోవడంతో తన స్నేహితుడు ఒకడు హైదరాబాదులో ఓ ప్రాంతంలోని సైకిల్ షాప్ అద్దెకు ఉండేవాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్లి ఆ సైకిల్ షాప్ లో పని చేసేవాడు. ఇక చివరికి ఆయన జీవితం కూడా అక్కడే ముగిసిపోయింది. వెండి తెరమీద ఆయనను చూసిన అభిమానులు, ఆ తర్వాత సైకిల్ షాప్ లో సహాయకుడిగా చూస్తున్న సమయంలో చాలా మంది విధి వైపరీత్యం అంటే ఇలానే ఉంటుంది అని అనుకున్న వారే. 15 సంవత్సరాల క్రితం ఈయన మల్కాజిగిరిలో ఎవరికి తెలియకుండా మరణించారు. ఇక్కడ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరి జీవితానికి వారే కారకులు..కాబట్టి, చెడు మాటలు విని అటు వైపు వెళితే నాశనమయ్యేది వారి జీవితమే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago