Kantara 2: కన్నడ హీరోగా ఆయన దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.
ఇలా ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఎన్నోసార్లు ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దర్శక నిర్మాతలు కూడా పలు మార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ పనులను ప్రారంభించినట్లు సమాచారం.
ఈ సినిమా సీక్వెల్ నేపథ్యంలో కర్ణాటక మంగళూరు శివారులోని కద్రి మంజునాథేశ్వర ఆలయాన్ని దర్శించారు. ఈ ఆలయంలో జరిగిన భూతకోలకు హీరో హీరోయిన్లతో పాటు నిర్మాతలు ఇతర చిత్ర బృందం హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ ఆడిగ సమక్షంలో ‘కాంతార’ సీక్వెల్ నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పంజుర్లి దైవం నుంచి కాంతార సీక్వెల్ చిత్రానికి సంపూర్ణ ఆశీస్సులు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో పంజుర్లి దైవం హీరో రిషబ్ శెట్టికి కొన్ని కండిషన్ లను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో నియమనిష్టలతో దైవభక్తితో షూటింగ్ చేయాలని పంజుర్లి దైవం ఆదేశించినట్టు సమాచారం.కాంతార విషయంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయని అయితే ఆ తప్పులను క్షమించి మరోసారి ఈ సినిమా సీక్వెల్ విషయంలో తప్పులు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక సీక్వెల్ చిత్రాన్ని కూడా ఇదే చిత్ర బృందంతో చేయాలని ఆదేశించినట్లు సమాచారం. స్వచ్ఛమైన మనసుతో సినిమా చేస్తే విజయానికి తాను భరోసా ఇస్తానని పంజుర్లి దైవం తన ఆశీస్సులను తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వచ్చే ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించినట్టు తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…