Featured

Karate Kalyani : కరాటే కళ్యాణి ఇంట్లో పోలీసుల సోదాలు… పెంచుకుంటున్న ఆ ఇద్దరు పిల్లలు ఎవరు..?

Karate Kalyani : ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కరాటే కళ్యాణి ఎస్ ఆర్ నగర్ లోని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం, గొడవపడటం, తరువాత ఒక్కసారిగా కరాటే కళ్యాణి శ్రీకాంత్ ని కొట్టడం జరిగింది. ఆ తరువాత పక్కనున్న వాళ్ళు యూట్యూబర్ శ్రీకాంత్ ను కొట్టడంతో శ్రీకాంత్ కూడా కరాటే కళ్యాణి ని చెంప పై కొట్టడం ఇదంతా తెలిసిన విషయమే. ఎస్ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇటీవలే నటి కరాటే కళ్యాణి మరియు యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు.

తనపై దాడి చేసిన శ్రీకాత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే ఇద్దరి పై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్‌ రెడ్డికి సిఐ సపోర్ట్ చేస్తున్నారని ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ సైదులుపై కరాటే కల్యాణి మండిపడింది. తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా కరాటే కల్యాణి సీఐపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. వీరి మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ గొడవ జరుతుందగానే ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా కరాటే కళ్యాణి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు కంప్లైంట్ ఇవ్వడం, ఇక ఇపుడు తాజాగా కరాటే కళ్యాణి పెంపుడు పిల్లల గురించి పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా పిల్లలను దత్తత తీసుకొని ఇంట్లో పెట్టుకుంది అని ఒక అజ్ఞాత వ్యక్తి 1098 నెంబర్ కి ఫిర్యాదు చేసాడు. దీంతో ఈ వివాదం లో మరో కోణం వెళగులోకి వచ్చింది.

ఇంతకీ ఆ పిల్లలు ఎవరు…..

అయితే గుర్తు తెలియని వ్యక్తుల ఫిర్యాదు మేరకు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కళ్యాణి నివాసం అయిన యర్రగడ్డలోని రాజీవ్ కాలనీ లో శ్రీ లక్ష్మి నిలయం అపార్ట్మెంటులో సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో కరాటే కళ్యాణి పిల్లలు ఇద్దరు ఇంట్లో లేరు, తల్లి మాత్రమే ఇంట్లో వున్నారు. తన కుమార్తె గుడికి వెళ్లిందని.. ఎప్పుడు వస్తుందో తెలియదని.. పోలీసులకు కళ్యాణి తల్లి తెలిపారు. కరాటే కళ్యాణి, ఒక 12 ఏళ్ల ఒక బాబు ను , ఐదు నెలల ఒక పాపను పెంచుకుంటోందని తెలిపారు. పిల్లలను పెంచుకోవడజంలో తప్పు ఏముందని ఆమె పోలీసులని ప్రశ్నించారు. అయితే శ్రీకాంత్ రెడ్డి తో గొడవ సమయం లో కూడా కళ్యాణి దగ్గర పాప వుంది. కాగా ఇపుడు కళ్యాణి పోలీసులు వస్తున్నారని బయటకు వెళ్లిందా, లేక నిజంగానే వెళ్లిందా, అసలు పిల్లలు ఎవరు, పిల్లలను ప్రభుత్వ అనుమతితోనే దత్తత తీసుకుందా అనే విషయాలు తెలియాల్సిన వుంది.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

4 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

4 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

4 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

4 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

4 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

4 hours ago