Kota Srinivas Rao : విలక్షణ విలనిజం అతని సొంతం. కామెడీ అయినా, ట్రాజెడీ అయినా, విలనిజం అయినా, సెంటిమెంట్ అయినా కోటా అందులో ఒదిగిపోతాడు. తన మార్కు నటనతో హావభావాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే వయసు మేష పడటంతో కోటా శ్రీనివాసరావు ఇపుడు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు దాదాపుగా వెండి తెరకు గుడ్ బాయ్ చెప్పేసారు. ఇక అపుడపుడు యూట్యూబ్ చానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఇప్పటి సంగతులను చెబుతుంటారు. అయితే ఈ మధ్య కోటా వివాదాస్పదమైన మాటలు మాట్లాడి బాగా విమర్శలను అందుకుంటున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్నారు.
మెగా కుటుంబం పై ఎందుకు అంత కోపం…..
కోటా ముఖ్యంగా మెగా కుటుంబం పై విమర్శలు చేసి ట్రోల్ కి గురవుతున్నారు. మెగాస్టార్ చిరు సినిమా కార్మికుల కోసం ఆసుపత్రి కడతామంటే ముందు ఆకలితో ఉన్నా వారికి అన్నం పెట్టించండి. మిగతావి తరువాత అంటూ విమర్శించారు. ఇక రామ్ చరణ్ నటన పై కూడా స్పందించారు. చిరంజీవి కొడుకుగానే సినిమాలు వస్తున్నాయి అతని నటన ఇంక ఎక్కడ కనిపించలేదు అతనికన్నా ముందు వరుసలో ఎన్టీఆర్, మహేష్ , అల్లు అర్జున్ లు ఉన్నారంటూ అనేశాడు.
ఇక ఈ తరం నటులలో ఎన్టీఆర్ అంత గొప్పగా ఎవరు నటించలేరని అతనికి పోటీ ఎవరు లేరంటూ చెప్పాడు. ఎన్టీఆర్ తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్ బాగా నటిస్తారంటు చెప్పడంతో మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. రంగస్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్ సినిమాలు కనిపించలేదా రామ చరణ్ నటన అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే సినిమా జనం మాత్రం అసలు కోటా కి ఏమైంది కెరీర్ మొత్తం అందరి వద్ద బాగున్నా కోటా కెరీర్ ముగిసాక ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. వ్యక్తిగతంగా అందరిని ప్రశంసించే కోటా ఇపుడు ఎందుకు ఇలా కొందరిని విమర్శిస్తున్నారు, అసలు మెగా ఫ్యామిలీకి ఈయనకు ఎక్కడ చెడింది అంటూ ఆరాలు మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఇలా కోటా మాత్రం మాటల తుటాలతో మెగా కుటుంబాన్ని విమర్శిస్తూ, అభిమానులకు కోపం తెప్పిస్తున్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…