Featured

Karate Kalyani: నేను మోసపోయా.. నాపై నిందలు వేస్తున్నాడు అంటూ మీడియా ముందు ఏడ్చిన కరాటే కళ్యాణి..!

Karate Kalyani: గురువారం రాత్రి కరాటే కళ్యాణి ఎస్ ఆర్ నగర్ లోని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం, గొడవపడటం తో ఒక్కసారిగా కరాటే కళ్యాణి శ్రీకాంత్ ని కొట్టడం, ఆ తరువాత పక్కనున్న వాళ్ళు శ్రీకాంత్ ను కొట్టడంతో శ్రీకాంత్ కూడా కరాటే కళ్యాణి ని చెంప పై కొట్టడంతో పసిబిడ్డను ఎత్తుకున్న కళ్యాణి ఆ బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత కళ్యాణి శ్రీకాంత్ ను పరిగెత్తించి మరీ కొట్టింది. ఎస్ ఆర్ నగర్ నుండి మధుర నగర్ వరకు తరిమింది.

నన్ను మోసం చేసాడు…

ఇక శుక్రవారం ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు పెట్టారు ఇక మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తనను అసభ్యకరంగా తాకడంతో అందుకే కొట్టానని కళ్యాణి ఆరోపించింది. ఇక శ్రీకాంత్ రెడ్డి కూడా కళ్యాణి పై ఆరోపణలు చేసాడు లక్ష రూపాయలు డబ్బు అడిగింది ఇవ్వను అన్నందుకు నాపై దాడి చేసిందని చెప్పాడు తాను పెయిడ్ ఆర్టిస్తులతో ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని తప్పేమి చేయడం లేదు అంటూ వాపోయాడు.

ఇక ఈ ఘటన ఇక్కడితో ఆగకుండా కళ్యాణి మీడియా ముందుకు వచ్చి భోరున ఏడ్చింది. వాడు తప్పించుకోవటానికి నాపై నిందలు వేస్తున్నాడు. వాడు చేసిన ఆరోపణలలో ఒక శాతం నిజమున్నా మీడియా ఏం చెబితే అది చేస్తా. నేను ఆడ వాళ్లకు మద్దతు ఇచ్చి మోసపోయా. కొన్ని మీడియా సంస్థలు వెధవలకు సపోర్ట్‌ చేస్తున్నాయి. సొంత అక్కలతో, చెల్లెళ్లతో ఇలానే చేస్తాడా.. పిల్లలు పాడైపోతే నేను ఊరుకోను, నన్ను వాడు బెదిరించాడు. బయట ఎలా తిరుగుతావో చూస్తానన్నాడు. వాడు పరమ 420 అంటూ తీవ్ర స్థాయిలో శ్రీకాంత్ పై మండిపడింది కరాటే కళ్యాణి. ఇక శ్రీకాంత్ కరాటే కళ్యాణి పై అట్టెంప్ట్ టూ మర్డర్ బ్లాక్ మైలింగ్ కేసులను పెట్టాడు. తనకు కళ్యాణి నుండి ప్రాణహాని ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరి ఆరోపణలలో ఎవరిది నిజమో వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

10 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

10 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

10 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

10 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

10 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

10 hours ago