Featured

Karate Kalyani vs Srikanth Reddy: ముదిరిన కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డిల వివాదం..! అసలు తప్పెవరిది ?

Karate Kalyani vs Srikanth Reddy: కరాటే కళ్యాణి సినిమాలలో అడపాదడపా పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన నటి. ప్రాంక్ వీడియోల పేరిట యూట్యూబ్ లో రచ్చ చేసే బ్యాచ్ చాలా మందే ఉన్నారు అలాంటి వాళ్ళలో శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు . యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక గురువారం రాత్రి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ కి మధ్య వివాదం మొదలై ఇద్దరు కొట్టుకున్నారు. ఇక ఈ విషయం పై ఇద్దరు సోషల్ మీడియా వేదిక గా ఆరోపణలు చేసుకున్నారు.

నాతో అసభ్యంగా ప్రవర్తించాడు…..

కరాటే కళ్యాణి గురువారం రాత్రి ఎస్ ఆర్ నగర్ లోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ప్రాంక్ వీడియోలు అసభ్యకరంగా తీస్తావా సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నావ్ అంటూ చేయి చేసుకుంది. అనంతరం ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి శ్రీకాంత్ రెడ్డిని పట్టుకుని కొట్టాడు. దీంతో గొడవ పెద్దదై తిరగబడ్డ శ్రీకాంత్‌ రెడ్డి తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణిని కొట్టాడు. ఇక ఈ గొడవలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి విపరీతంగా కొట్టారు. కింద పడిపోయిన కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరిగెత్తించి గుడ్డలూడదీసి మరీ కొట్టింది. అంతేకాదు బూతులు తిడుతూ ఎస్ ఆర్ నగర్ నుంచి మధురానగర్ వరకూ అతన్ని పరుగుపెట్టించి మరీ కొట్టింది.

కరాటే కళ్యాణి ఈ వివాదం పై స్పందించి, శ్రీకాంత్‌ రెడ్డి నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. తనతో పడుకోవాలని అడిగాడని, బొడ్డుపై చెయ్యి పెట్టాడని ఆరోపించింది. అందుకే అతడిని కొట్టాల్సి వచ్చిందని చెప్పింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల్ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడో చేతులు వేసి మహిళల్ని అగౌరవ పరుస్తున్నాడని ఆరోపించింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, మహిళల్ని రెచ్చగొట్టి తన కోరికలను తీర్చుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రెండు లక్షల రూపాయలు తన నుండి డిమాండ్‌ చేశాడని ఆరోపించింది. ఇక శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణి పై ఆరోపణలు చేసాడు. లక్ష రూపాయలు కరాటే కళ్యాణి తనను డిమాండ్ చేసిందని ఇవ్వను అన్నందుకు తనపై దాడి చేసిందని చెప్పాడు. డబ్బులిచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని చెప్పాడు. కరాటే కళ్యాణి సినిమాల్లో వ్యాంప్ పాత్రలు చేయడం లేదా, సినిమాల్లో ఊ అంటావా ఉహు అంటావా అంటూ వచ్చే పాటలను ఆదరిస్తునపుడు నేను చేసే వీడియోల్లో తప్పేంటి అందుకు కొడతారా అంటూ ఆరోపించాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago