Featured

ఆత్మహత్యకు పాల్పడిన మోనిత.. బయటపడిన అసలు నిజం!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ జూలై 17 న 1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.గత ఎపిసోడ్లో ఆనందరావు తన పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న కార్తీక్ కు మోనిత ఫోన్ చేసి ఈ వీడియో చూడు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతోంది. దాంతో ఈ వీడియో చూసిన కార్తీక్ భోజనం చేయకుండా.. చేతులు కడిగి, దీప పిలుస్తున్నా వినిపించుకోకుండా కారు తీసుకొని సరాసరి మోనిత ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళే సరికి బెడ్ మీద పడి ఉంటుంది మోనిత. ఆ సమయంలోనే డాక్టర్ భారతి మోనితకి ఇంజక్షన్ వేస్తుంది.

మంచం కింద ప్రియమణి కూర్చుని “మా అమ్మగారిని పట్టించుకునే వారు ఎవరూ లేరమ్మా”.. మా అమ్మగారిని ఎవరు అర్థం చేసుకోవడం లేదూ.. అంటూ ఏడవడంతో ప్రియమణి ఆపు అంటూ భారతి అంటుంది.కార్తీక్ ని చూసిన భారతి టైం కి ప్రియమణి చూడకపోతే ప్రాణాలు పోయేవి కార్తీక్.. ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నావ్… ఇప్పుడిప్పుడే నువ్వు దీప కలుసుకుంటున్నారు మరి ఇదంతా ఏంటి అని అంటుంది.అదే సమయంలోనే ప్రియమణి ఈ మత్తులోనే మా అమ్మగారికి కడుపు తీసేయండి అమ్మ దాని వల్లే కదా ఈ సమస్యలన్నీ అనగా.. ఆ పని చేయండి అంటూ రోషిని ఎంట్రీ ఇస్తుంది.
రోషిని చూడగానే కార్తీక్ తలదించుకున్నాడు.

మోనిత కి ట్రీట్మెంట్ ఇచ్చి భారతి వెళ్ళిపోతుంది. ఎసిపి రోషిని కార్తీక్ తో మాట్లాడాలి బయటికి రమ్మని పిలుస్తుంది. వెళ్ళగానే ఎందుకు చేసావ్ ఈ పని? రాయల్ ఫ్యామిలీకి చెందిన నీకు హద్దులు, హక్కులు తెలుసు.మీరు మోనితని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నిజమేనా? మనసు పడి కాదు.. అంటాడు కార్తీక్. ‘మరి ఏం పడి? మోజు పడా? అని రోషిని అడిగింది. దీంతో కార్తీక్ నాకు దీపకు ఉన్న మనస్పర్థలు మీకు తెలుసు. మా మమ్మీ మా ఇద్దరినీ కలపాలని చూస్తుంది.మోనితని పెళ్లి చేసుకుంటే మా మమ్మీ బలవంతం పెట్టద్దనే ఉద్దేశంతోనే తప్ప మేమిద్దరం మంచి స్నేహితులం ఈ తప్పు మాత్రం… అని కార్తీక్ అంటుండగా.. మీకు తెలియకుండానే జరిగింది.. అవునా అంటుంది రోషిణి.

మోనిత చెప్పే వరకు ఈ విషయం జరిగిందనేది నాకు అసలు తెలియదు. అనే కార్తీక్ చెప్పగా..మీరు ఎన్ని చెప్పినా ఫలితం భరించకతప్పుదు కార్తీక్ అంటుంది రోషిణి. ఈ మాట విన్న మోనిత నాకు కూడా ఇదే కదా కావాల్సింది అని మనసులో అనుకుంటూ. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న కార్తీక్.. జరిగిన విషయం మొత్తం గుర్తు చేసుకుంటాడు. ప్రియమణి ఫోన్ చేయక పోతే ప్రాణాలు కోల్పోయిందని భారతీ చెప్పగా.. అదే సమయానికి రోషిని అక్కడికి వచ్చి ప్రియమణి చెప్పకపోతే ఈ విషయం నాకు తెలిసేది కాదని రోషిని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్న కార్తీక్ ఇదంతా నాటకం.. ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తుందనే నిజం తెలుసుకుంటాడు. మమ్మీ దీప, మోనిత గురించి చెప్పినప్పుడే జాగ్రత్తపడి ఉండాల్సింది అంటూ మనసులోనే మధన పడతాడు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో మరో ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago