Movie News

Karthika Deepam : నువ్వే జైల్లో ఉన్నావ్ దీప.. కార్తీక్ మాటలు.. ప్రేక్షకులు కన్నీళ్లు.. కార్తీకదీపం ఒక క్రైమ్ సీరియల్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన హైలెట్ సీన్స్ ఏంటో చూద్దాం.. సౌందర్య దీపను ప్రశ్నించడంతో వెంటనే మోనిత వీడియో చూపిస్తుంది. ఇక ఆ వీడియో చూసి కార్తీకే చంపేసి ఉంటాడని అనడంతో అందరు షాక్ అవుతారు. దీప మాత్రం నేను నమ్మను అంటూ ఏడుస్తుంది.

వెంటనే ఆదిత్య మాట్లాడుతూ.. గతంలో కార్తీక్ ఆవేశంలో వచ్చిన విషయాన్ని తెలుపుతాడు. అంతేకాకుండా కార్తీక్ చంపాడు అన్నట్లు మాట్లాడేసరికి దీప చాలా బాధపడుతుంది.

ఇక భాగ్యం కూడా తాను ఆరోజు విన్నది నిజమే అంటూ మాట్లాడేసరికి దీప ఏడుస్తూ కుమిలిపోతుంది. ఎవరు నమ్మటం లేదు అంటూ డాక్టర్ బాబు చెప్పిన మాటలు వల్ల నాకు నమ్మకం ఉంది అంటూ చెప్పి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి బయల్దేరుతుంది.

దారిలో రోషిణికీ ప్రియమణి కనిపించడంతో.. వెంటనే ప్రియమణి మోనిత గురించి, హత్య గురించి మాట్లాడుతుంది. ఆ మాటలు ఏమి వినకుండా రోషిణిని తనను కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంది.

మరోవైపు దీప భోజనం తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లగా కానిస్టేబుల్ అడ్డుపడుతాడు. ఎంత బతిమాలినా కానిస్టేబుల్ లోనికి పంపించడు. అంతలోనే కొత్తమ్మాయిగా కనిపించిన రత్న సీత వచ్చి దీపని తీసుకెళ్తుంది. దీప మాత్రం ఆమె ఎవరు అన్నట్లు చూస్తుంది.

మరోవైపు సౌందర్య హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటుండగా పిల్లలు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మన గురించేనా అంటూ.. నాన్న అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని ప్రశ్నలు వేస్తారు. ఇక పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతారు. పిల్లలు ఏడుస్తుంటే తన దగ్గరికి తీసుకుని ఓదార్చుకుంటుంది.

ఇక కార్తీక్ దగ్గరికి వెళ్లిన దీప..ఇలా చూస్తాను అని ఏనాడు అనుకోలేదు డాక్టర్ బాబు అంటూ బాధపడుతుంది. కార్తీక్.. నా వల్ల నీకు మళ్లీ శిక్ష పడినట్లు అనిపిస్తుంది అంటే ఎమోషనల్ అవుతాడు.

అలా వారి మధ్య మాటలు కాసేపు ఎమోషనల్ గా సాగుతుంది. నాపై ఎందుకు అంత నమ్మకం దీపని ప్రశ్నిస్తాడు కార్తీక్. తప్పు చేయలేనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. పట్టుకోవడానికి ఏ ఆధారం లేనిది ఎలా బయటకు చెప్పను అన్నట్లు మాట్లాడతాడు.

గతంలో తమ దూరమున్న విషయాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంది దీప. మిమ్మల్ని బయటికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తాను అంటూ.. బాధ్యతగా కర్తవ్యం అంటూ మాట్లాడుతుంది.

నువ్వు పిల్లలు అమ్మా నాన్న దగ్గర క్షేమంగా ఉంటారని.. ఎటువంటి లోటు ఉండదు అని కార్తిక్ అనేసరికి.. వెంటనే ఏం లోటూ అని సమాధానాలు చెబుతు ఏడుస్తూ కుంగిపోతుంది.

నన్ను పెళ్లి చేసుకున్న అప్పటి నుంచి నీకు కష్టాలే ఉన్నాయి అని కార్తీక్ అంటాడు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కార్తీక్, దీప మధ్య ఎమోషనల్ గా సాగుతుంది.

అతర్వాత రోషిణి.. ‘దీపను’ మీ ఆయన మోనిత శవాన్ని ఎక్కడ దాచి పెట్టాడు అని అడగమంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago