Kasthuri Shankar : సీనియర్ హీరోయిన్ కస్తూరి అందరికీ సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించిన కస్తూరి అందరికీ సుపరిచితమే. ఇక సినిమాల తరువాత బిగ్ బాస్ తమిళ్ లో పాల్గొని మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అప్పుడప్పడు టీవీ షోలలో గెస్ట్ గా వచ్చి అలరిస్తున్న కస్తూరి మా టీవిలో వచ్చే ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా బుల్లితెర అభిమానులకు పరిచయం. సీరియల్ లవర్స్ చాలా మంది ఇష్టపడుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక కస్తూరి ఆ సీరియల్ లో తులసిగా మెయిన్ లీడ్ లో నటించింది. ఆ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది.
ఎన్టీఆర్ ను కాదు మంచు లక్ష్మీని…
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ అమెరికన్ మీడియాతో అమెరికన్ఇంగ్లీష్ యాసలో మాట్లాడటంతో మన తెలుగు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసారు. ఇక ఈ విషయం గురించి సీనియర్ నటి కస్తూరి ఒక ఇంటర్వ్యూలో ప్రస్థావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ తప్పుగా ఏం మాట్లాడలేదు. అక్కడి ప్రజలకు అలా మాట్లాడితేనే అర్థం అవుతుంది అందుకే అలానే మాట్లాడాడు. అలా వారి భాషను సహజంగా వారిలా మాట్లాడటం కూడా ప్రతిభ కాదా, దాన్ని మెచ్చుకోవాలి కానీ ఇలా ట్రోల్ చేయడం ఏమిటి అంటూ కామెంట్స్ చేసారు.
ఇక మంచు లక్ష్మి ప్రస్తావన రాగా ఇక్కడ తెలుగు మాతృ భాష, అయినా లోకల్ లో మన భాష మాట్లాడకుండా అమెరికన్ ఇంగ్లీష్ ట్రై చేస్తే ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. మంచు లక్ష్మి విషయాన్ని ఎన్టీఆర్ విషయాన్ని పోల్చడం సరికాదు అంటూ మాట్లాడారు. ఎన్టీఆర్ ఎక్కడైనా లోకల్ భాషలో మాట్లాడి అక్కడి జనాలను ఆకర్షస్తున్నారు అది తప్పు కాదు కదా అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…