Kasturi : 1500 వందలకు పైగా సినిమాలకు కోరియోగ్రఫీ చేసి డాన్స్ మాస్టర్ గా తనకంటూ డిఫరెంట్ స్టైల్ చూపించిన మాస్టర్ రాకేష్ మాస్టర్, ఆయన అసలు పేరు రామారావు. తిరుపతి కి చెందిన ఆయన డాన్స్ మీద ఇష్టంతో డాన్స్ నేర్చుకుని డాన్స్ స్కూల్ నడుపుతూ అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి అక్కడ డాన్స్ స్కూల్ ద్వారా ఎంతో మందికి డాన్స్ నేర్పాడు. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు డాన్స్ నేర్పిన ఆయన తన శిష్యులను బాగా తీర్చిదిద్దారు. నేడు ఇండస్ట్రీలో ఫేమస్ కోరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరూ కూడా ఆయన శిష్యులే. ఇక హీరోలైన ప్రభాస్ వంటి వారికీ డాన్స్ నేర్పించారు. అలాంటి అయన చివరి రోజుల్లో ఒంటరిగా మిగిలిపోయారు. ఆయన మరణించిన తరువాత ఆయన గురించి ఆయన స్టూడెంట్స్ ఎమోషనల్ గా మాట్లాడారు. ఆయన జీవితాన్ని నాశనం చేసింది వాళ్ళే అంటూ మాట్లాడారు.
మాస్టర్ కి పేరు పెట్టింది నేనే…
రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు కాగా ఇండస్ట్రీలో ఆపేరు చాలా మందికి ఉండటం వాళ్ళ పేరు మార్చుకోవాలని సలహా ఇవ్వగా రాకేష్ అనే పేరును ఆయన మొదటి శిష్యురాలు కస్తూరి పెట్టారట. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుందని ఆయన తన స్టూడెంట్స్ కి డాన్స్ తో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించారని చెప్పారు. ఆయన మొదట్లో తాగుడు ఏమి లేకుండా బాగుండేవారు. కానీ ఎపుడైతే తాగుడుకు అలవాటు పడ్డారో ఆపైనే ఆయన పతనం మొదలయింది. ఆయన చుట్టూ చేరిన వారే ఆయనను నాశనం చేసారు. చావుకు కారణం అయ్యారు.
ఆయనకు ఏదో మంచి చేస్తున్నాం అంటూ చెప్తూనే తాగించి ఇంటర్వ్యూలలో రెచ్చగొట్టి మాట్లాడించి ఆయన జీవితాన్ని నాశనం చేసారు అంటూ కస్తూరి తెలిపారు. మాలాంటి స్టూడెంట్స్ ఆయనను కలవనివ్వకుండా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కుట్ర చేసారు. రెండేళ్ల క్రితం వరకు కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ యూట్యూబ్, టిక్ టాక్ వాళ్ళు కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం ఆయనకు తాగించి సెలబ్రిటీలను తిట్టించి పబ్బం గడుపుకున్నారు. చివరికి ఆయన చనిపోయాక కూడా చిల్లర ఏరుకుంటున్నారు, ఆయన మరణంనూ వదలడం లేదు అంటూ చెప్పారు.
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…