ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ కత్రినా, విక్కీల వివాహం. వీరి పెళ్లి గురించి గత రెండు మూడు రోజులుగా బాలీవుడ్ సినీ వర్గాలలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ బాలీవుడ్ కోడైకూస్తోంది.
పెళ్లి పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవలే కత్రినా సన్నిహితుడు అయిన ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో కత్రినా, విక్కీల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ జంట డిసెంబర్ మొదటి వారంలో రాజస్థాన్ లోని ఒక విలాసవంతమైన ప్యాలెస్ లో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. రాజస్థాన్ లోని విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ ఆఫ్ పోర్ట్ బర్వరాలో డిసెంబర్ 9న ఈ ప్రేమ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ముహూర్తం రోజు సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
అయితే వీరి పెళ్లికి అతికొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 7న మెహందీ, 8 సంగీత్ వేడుకలు జరగనున్నాయట. ఈ క్రమంలోనే పెళ్లికి అతి తక్కువ రోజులు ఉండటంతో పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక మెహందీ ఫంక్షన్ కోసం కత్రినా కైఫ్ భారీగానే ఖర్చు చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…