గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్న పేరు ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.డాన్సర్ గా,ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత అయిన శివ శంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ తేలడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అతని ఆరోగ్యం విషమంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
కరోనా వల్ల శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటుగా అతడి భార్యకి కరోనా నిర్ధారణ అవ్వడంతో ఆమె ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు కూడా కరోనా బారినపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.కుమారుడి చికిత్సకు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనితో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ కు అండగా మంచు విష్ణు, హీరో ధనుష్, సోను సూద్ లాంటివారు ముందుకు వచ్చి తాము ఉన్నామని తెలిపారు. ఇక తాజాగా శివ శంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే వైద్యానికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
ఇక శివ శంకర్ మాస్టర్ తనయుడు అజయ్ మాట్లాడుతూ.. నాన్నకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే చిరంజీవిగారు ఫోన్ చేసి పిలిపించారని, తన సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారని అతను తెలిపారు. మెగాస్టార్ ఈ మూడు లక్షల చెక్కును అజయ్ కు అందజేశారు. ఇక చిరంజీవికి, తన నాన్నకి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అజయ్. చిరంజీవి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…