కత్రినా కైఫ్ డిసెంబర్ 9 న విక్కీ కౌశల్ తో వివాహం అయిన విషయం తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభంగా ఈ వివాహం జరిగింది. అయితే వివాహం జరిగి మూడు రోజులు కూడా కాలేదు .. మరో మూడు రోజుల్లో వీళ్లిద్దరు విడిపోనున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఇద్దరు కలిసి హనీమూన్ కు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు.
కానీ షూటింగ్ లో పాల్గొనేందుకు చెరో ప్రాంతానికి వెళ్లిపోతున్నారట. ఇక దీనిపై నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లి జరిగి మూడు రోజులు కాలేదు.. హనీమూన్ లేదు.. పారాణి ఆరనే లేదు.. కానీ విడిపోడానికి మాత్రం సిద్ధంగా ఉండటం ఏంటి అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యపోతున్నారు.
ఇక కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. మొదట సల్మాన్ ఖాన్ తో లవ్ చేసి బ్రేకప్ చేసిన తర్వాత.. రణబీర్ కపూర్ తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం విక్కీ కౌశల్ తో పెళ్లి. తర్వాత మళ్లీ వీరిద్దరు విడిపోవడం వంటి నిర్ణయాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకుండా.. సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఈ నెల 15 నుంచి.. సల్మాన్ ఖాన్ తో షూటింగ్ లో బిజీ అవ్వబోతోంది కత్రినా. ఇక ఇంత బిజీ షెడ్యూల్ తర్వాత ఫిబ్రవరిలో హనీమూన్ ఉంటుందనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీరిద్దరు.. కాపురం చేసుకోకుండా.. సినిమాల షూటింగులకు వెళ్లడంపై విమర్శలు వినిపిస్తన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…