తెలుగులో బిగ్ బాస్ 5 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. హౌజ్ నుంచి చివరి ఎలిమినేషన్ లో కాజల్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో బిగ్‌బాస్ 5 మాజీ హౌస్‌మేట్స్ ప్రత్యక్షం అయ్యారు.
హౌస్‌లో కొనసాగుతోన్న కంటెస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జెస్సీ అలియాస్ జశ్వంత్ పడాల, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, నటరాజ్ మాస్టార్, యానీ మాస్టార్, ప్రియా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో ప్రశ్నలు వేశారు. ఇక దీనిలో జెస్సీ ఒక్కడే సిరికి, షణ్ముఖ్ కు ప్రశ్నలు వేశాడు.
సిరితో షణ్ముఖ్ రిలేషన్ పై మీ వ్యవహారాన్ని చూసి జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా? షన్ను. చాలా సీరియస్‌గా అడుగుతున్నాను. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో.. జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా?..అని నిలదీశాడు. సిరి హన్మంత్ పై కూడా ప్రశ్నలు సంధించాడు.
దీనికి వాళ్లు దానికి దగ్గట్లు సమాధానం చెప్పారు. చివరకు షణ్ముఖ్ సిరితో ఉన్న బాండింగ్ గురించి చెప్పాడు. మా ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ బాండ్ మాత్రమే ఉందంటూ స్పష్టం చేశాడు. ఇక కాజల్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత హౌజ్ లో ఆమె స్నేహితులు సన్నీ మరియు మానస్ ఎమోషనల్ అయ్యారు. టాప్ 5 లో చివరి కంటెస్టెంట్ గా మానస్ చోటు సంపాదించుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…