జనరల్ నాలెడ్జ్ రూపంలో ఒక రియాల్టీ షోగా మన ముందుకు వస్తున్నది కేబీసీ (కౌన్ బనేగా కరోడ్‌పతి). దీనికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తన్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా రూ.కోటి గెలుచుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ షోకి హిందీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది. ఈ షో వస్తుందంటే చాలు.. టీవీల ముందు వాలిపోతారు.
తెలుగులో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కూడా దాని నుంచి స్పూర్తి పొందిందే. కంటెస్టంట్ల విషయంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా వాళ్ల జీవితాల్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను అందరికీ పరిచయం చేస్తూ ఈ షో ముందుకు నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు జోక్స్ కూడా వేస్తుంటారు అబితాబ్. సెలెబ్రిటీలు కూడా అప్పుడప్పుడు మెరుస్తుంటారు.
తాజాగా ఈ షోకి యాక్షన్ హీరో జాన్ అబ్రహం హాజరయ్యాడు. అతడి తాజా చిత్రం సత్యమేవ జయతే 2 ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ దివ్యా ఖోస్లా కుమార్‌తో కలిసి షోలో పాల్గొన్నాడు. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. కొన్ని విషయాలను పంచుకున్నారు. అతడి వేలిపై ఫుట్ బాల్ ను తిప్పి ఆకట్టుకున్నాడు. ఇదే ప్రయత్నం బిగ్ బీ చేయగా ఫెయిల్ అయ్యాడు. తన సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. ఇక తన ధూమ్ సినిమాకు సంబంధించి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ధూమ్ సినిమా రిలీజ్ రోజున తాను మీ దగ్గరకు బైక్ పై వచ్చాను.. అప్పుడు మీరు ఈ విషయంలో అభిషేక్ ను ప్రోత్సహించొద్దు అని అన్నారు.. తర్వాత అభిషేక్ కిందకు రాగానే ‘వావ్ బైక్ బాగుంది’ అంటూ తనతో మాట మార్చారు అని గుర్తు చేశారు. దానికి అబితాబ్ నవ్వాడు. తర్వాత ఏ విషయం గురించో ఈషోలో మాట్లాడి.. కన్నీరు పెట్టుకున్నాడు జాన్. దానికి గ్యాలరీలో ఉన్న వాళ్లు కూడా బాధపడ్డారు. అయితే జాన్ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…