Keerthy Suresh: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం మెగా లీక్స్ ఒక వీడియోని విడుదల చేయగా అందులో చిరంజీవి కీర్తి సురేష్ పీకపట్టుకున్న సంఘటన మనం చూసాము అయితే తాజాగా అలా కీర్తి సురేష్ పీక పట్టుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలియచేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కీర్తి కోసం తన ఇంటి నుంచే భోజనం వచ్చేదని చిరంజీవి తెలిపారు. మా ఇంట్లో తమిళ పనిమనిషి తనకు ఏమేం కావాలి అని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పంపించేవారని తెలిపారు.అయితే ఒక్కోసారి పప్పులో ఉప్పు కారం తక్కువైన కీర్తి వాటిని తినకుండా తిరిగి వెనక్కి పంపించేదని చిరు తెలిపారు.
ఇలా ఒక రోజు తాను షూటింగ్లో ఉండగా కీర్తి సురేష్ నా వద్దకు వచ్చి రేపు మెనూ ఏంటి అని నన్ను ప్రశ్నించింది. అయితే కోపం వచ్చిన తను సరదాగా కీర్తి పీక పట్టుకున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో నేటిజన్స్ పాపం మెనూ అడిగినందుకు పీక పట్టుకోవడం ఏంటి బాసు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…