Mehar Ramesh: మెహర్ రమేష్ ఎన్నో సినిమాలకు దర్శకుడుగా పని చేసినటువంటి ఈయన తాను దర్శకత్వం వహించిన సినిమాలలో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువగా చవిచూశారు.ఇలా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో ఈయనకు అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా అవకాశాలు లేనటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనకు భోళా శంకర సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు.
ఇలా ఈ సినిమా ద్వారా మెహర్ రమేష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా సక్సెస్ రమేష్ కు చాలా కీలకమైనదని చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి తమన్న జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకులందరికీ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
తాను చిన్నప్పటి చిరంజీవి గారికి పెద్ద అభిమానిని తెలిపారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి ఒక సినిమా ఆయన చేయాలనేది నా కోరిక అయితే భోళా శంకర్ సినిమాతో నా కోరిక నెరవేరిందని ఈ సందర్భంగా మెహర్ రమేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే తన కథ సినిమాల పరాజయాల గురించి కూడా ఈయన పరోక్షంగా మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు..
వరుస సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో ఎన్నో ఇబ్బందులలో ఉన్నటువంటి ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నా జీవితం షాడో లో ఉండిపోయింది అలాంటి నా జీవితానికి చిరంజీవి గారు వెలుగుని ఇచ్చారు ఇది నాకు పునర్జన్మ లాంటిది అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఇక ఈ సినిమాలో చిరంజీవి నటన చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలిపారు. అదేవిధంగా మెగా హీరోకి చెల్లెలుగా నటించాలి అంటే మెగా నటి అయి ఉండాలని భావించాను కానీ ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలుగా మహానటి లభించింది అంటూ కీర్తి గురించి కూడా ఈ సందర్భంగా మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…