Keerthy Suresh: హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ తాజాగా నాని సరసన నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. మహానటి సినిమా తర్వాత అలాంటి స్థాయిలో దసరా సినిమా సక్సెస్ కావడంతో ఈమె కెరియర్ సక్సెస్ ట్రాక్ లో పడిందని చెప్పాలి.
దసరా సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కీర్తి సురేష్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి అన్ని విషయాలను పంచుకోవడమే కాకుండా వారితో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ కీర్తి సురేష్ ను ప్రశ్నిస్తూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని పెళ్లి గురించి అడిగారు. ఇలా తన పెళ్లి గురించి నేటిజన్ ప్రశ్నించడంతో కీర్తి సురేష్ సమాధానం చెబుతూ జిఫ్ ఫైల్‌ను షేర్ చేసింది. అందులో లుంగీ ఎత్తినట్టు, జేబులు ఖాళీగా ఉన్నాయన్నట్టుగా చూపించింది. జేబులు ఖాళీగా ఉన్నాయ్….ఇంకా బాగా సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని తెలిపారు.
ఇలా పెళ్లి గురించి ప్రశ్నించడంతో కీర్తి సురేష్ చెప్పినటువంటి ఈ సమాధానం విన్న నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక ఈమె పెళ్లి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈమె చెప్పిన ఈ సమాధానం చూస్తే కీర్తి సురేష్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని తెలుస్తోంది. ఇక ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…