సౌత్ ఇండియా స్టార్ యాక్ట్రెస్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషలతో భారీ చిత్రాలు చేస్తూ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె స్టార్ హారోలతో కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇదంతా ఇలా ఉండగా.. కీర్తి సురేష్ యాంకర్ గా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అది కూడా నాలుగు భాషల్లో టెలి కాస్ట్ కానుందట. ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్లు కూడా యాంకర్లుగా అవతారం ఎత్తి ప్రముఖ ఓటీటీల్లో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న కీర్తి కూడా యాంకర్ గా మారనుంది. కీర్తి సురేష్ తో ఒక ప్రముఖ ఛానల్ సంప్రదింపులు జరుపుతోందని.. త్వరలోనే ఆమె యాంకర్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఆమె అందులో పూర్తిస్థాయిలో యాంకర్ కాకుండా వ్యాఖ్యాతగా చేసే అవకాశం ఉందని.. ఆ షో లో ఆమె ఇంటర్వ్యూలు చేసే అవకాశాలున్నాయని.. అంటున్నారు. ఆమె హోస్ట్ గానే కాకుండా.. వచ్చిన గెస్ట్ లతో గేమ్స్ కూడా ఆడిస్తుందట. అయితే ఈ షోకు కీర్తి సురేష్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ షో వారానికి రెండు నుంచి మూడు రోజల వరకు టెలికాస్ట్ అయ్యే విధంగా ప్రణాళికలు పూర్తి చేశారట.
ఇలా మొత్తం ఎపిసోడ్ లు పూర్తి చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కు ఆమెకు రూ.15 లక్షలు రెమ్యూనరేష్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఇంకా చిరంజీవి భోళా శంకర్ సినిమాల్లో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయనుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…