Movie News

తనకు లైఫ్ ఇచ్చింది కూడా ఆ దర్శకులే.. హీరో సందీప్ కిషన్..

సన్నీ నవీన్‌, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్‌ బండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్‌’. ఎస్ ఒరిజినల్స్, ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్‌ కొండెపు, సృజన్‌ యారబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కథానాయకుడు సందీప్‌కిషన్‌, దర్శకులు బుచ్చిబాబు సానా, కిషోర్‌, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కు బెస్ట్ విషేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జయకిషోర్ మాట్లాడుతూ.. తన సినిమా కొవిడ్‌ కారణంగా ఆలస్యం కాలేదని.. ఒక సాంకేతిక నిపుణుడి దగ్గర ఎనిమిది నెలలు ఆగిపోయిందని.. ప్రస్తుతం అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.

మధురానుభూతుల్ని పంచుతూ, అందరినీ మెప్పిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ చిత్ర బృందమంతా షార్ట్ ఫిల్మ్‌ల నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ”అని తెలిపారు.

తనకు హీరోగా లైఫ్ ఇచ్చింది కూడా షార్ట్ ఫిల్మ్ దర్శకులే.. ఈ సినిమ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక తాను హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇది అంటూ సన్నీ పేర్కొన్నాడు. ఇతకు ముందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago