Keerthy Suresh: వెండితెరపై నటిగా కొనసాగుతూ గ్లామర్ షో కి కాస్త దూరంగా ఉంటూ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి వారిలో కీర్తి సురేష్ ఒకరు.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఇండస్ట్రీలో తన కంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో నేను శైలజ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాల ద్వారా తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మార్చి 30 తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ తెలుగుతో పాటు తమిళ సినిమాలతో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి కీర్తి సురేష్ కెరియర్ మొదట్లో ఒక్కో సినిమాకి 40 నుంచి 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూనే భారీగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది.ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈమె దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం.
వీటితోపాటు చెన్నైలోనూ అలాగే హైదరాబాద్లోనూ ఖరీదైన బంగ్లాలు కూడా కొనుగోలు చేశారట. అలాగే కోట్ల విలువచేసే ఖరీదైన కార్లు కూడా ఈమె గ్యారేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.ఇలా ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని కీర్తి సురేష్ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ డబ్బును సంపాదిస్తున్నారు. రిలయన్స్ ట్రెండ్స్, జోస్ అలుక్కాస్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు ఒక్కో యాడ్ కోసం ఈమె 15 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అనుకోవడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…