Y.S Vijayamma: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పార్టీ పరిమితం కావడంతో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఇప్పటికి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.పార్టీ ఆలోచనా విధానం, ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తుంటాయని ఆయన అన్నారు. బాబు మాటలను ఎవరు నమ్మరని మేము భావించము జగన్ చాలా నిజాయితీగా అన్ని పథకాలను అమలు చేశారు.
చంద్రబాబు పింఛన్ ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకిి ప్లస్ అయిందని కేతిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ వారి నాన్న రాజశేఖర్ రెడ్డిలా భావించారని తెలిపారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో మేము ఓడిపోతామని ఎక్కడా కూడా మాకు సందేహాలు రాలేదని కేతిరెడ్డి తెలిపారు.
షర్మిలకు సపోర్ట్ చేయటం..
చంద్రబాబు అరెస్ట్ క్యాడర్ ను పోలరైజ్ చేసిందని ఆయన తెలిపారు. కమ్మ, కాపు కమ్యూనిటీలు పోలరైజ్ అయ్యాయని కేతిరెడ్డి వెల్లడించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగిందని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అంతేకాకుండా వైయస్ విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలకు సపోర్ట్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయిందని ఈ సందర్భంగా కేతిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈయన జగన్ ఓటమి పాలు కావడానికి తన తల్లి విజయమ్మ కూడా ఒక కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…