Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ కీలకపాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా విజయ్ దేవరకొండ కల్కిలో భాగం కావడంతో ఈయన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (నాగీ) మొదట దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ నటించిన ఆ సినిమా సక్సెస్ అయింది అనంతరం మహానటి సినిమాలో కూడా విజయ్ నటించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తన సినిమాలకు లక్కీగా మారిపోయారని అందుకే తనని కల్కి సినిమాల్లో కూడా భాగం చేశారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇదే విషయం గురించి ఇటీవల రిపోర్టర్స్ విజయ్ దేవర కొండను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్న పై విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..నేను నాగికి లక్కీ కాదు. ప్రభాస్ అన్న కోసం, నాగి కోసం ఈ సినిమాలో నటించా. కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విజయం సాధించింది.
ఎలాంటి పోటీ లేదు..
ఇందులో మనం చేసింది ఏమీ లేదు అంటూ ఈయన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు చాలా హుందాతనంగా సమాధానం చెప్పారు.నాగి క్రియేట్ చేసిన ఒక యూనివర్స్ లో నేను చిన్న పాత్ర చేశాను. అంతే కానీ ప్రభాస్ కర్ణుడు.. నేను అర్జునుడు లాంటి పోటీలు ఏమీ లేవని ఈయన తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…