Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి బాలీవుడ్ అవకాశాలను అందుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను ముంబై వెళ్లడానికి కారణం ఏంటి అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాననే విషయాలను వెల్లడించారు. తనని ముంబైకి రావాలి అంటూ రకుల్ రానా ఎక్కువగా పోర్స్ చేశారని తెలిపారు. అలా తాను ముంబై వెళ్ళిపోయానని ఈమె తెలిపారు. ఇక ముంబై వెళ్ళిన తర్వాత నాకు వెంటనే అపార్ట్మెంట్ దొరకలేదు ఎక్కడ ఉండాలో కూడా తెలియలేదు.
ఈ క్రమంలోనే ముంబైలో రామ్ చరణ్ అపార్ట్మెంట్ లో నేను ఉండే దానిని తెలిపారు. చరణ్ ను నీ ఫ్లాట్ లో ఉంటాను అని చెప్పగా తను ఉండమని చెప్పారు అంతేకాకుండా నేను మీ ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దని కూడా చెబితే నేనెందుకు చెబుతానని చరణ్ చెప్పారు కానీ నాకు కాస్త నోటి దూల ఎక్కువ కావడంతో ఇప్పుడు నేనే చెబుతున్నానని మంచు లక్ష్మి తెలిపారు.
సీక్రెట్ వాట్సాప్ గ్రూప్…
ఇక చరణ్ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నానో నాకే తెలియదు అంత అందమైన ఇంట్లో ఉండాలనిపించక వెళ్లిపోతానని చెప్పగా చరణ్ నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండమని చెప్పారు. అయితే నేను చరణ్ ఇంట్లో ఉండటం ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే అక్కడ ఎందుకు ఉన్నారు అంటూ నానా రచ్చ చేస్తారని దాచి పెట్టానని తెలిపారు. ఇక నాకు 142 మంది ఆర్టిస్టులు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని మా సినిమాలు ఎవరివి రిలీజ్ అయిన ప్రమోషన్ల కోసం ఈ గ్రూపులలో షేర్ చేస్తూ ఉంటాను అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…