Featured

Kirrak RP : జబర్దస్త్ బానిస బతుకులు అంటూ మరోసారి రెచ్చిపోయిన ఆర్పి…షేకింగ్ శేషు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లపై ఫైర్…!

Kirrak RP : జబర్దస్త్ లో బానిస బతుకు బతకలేక, వాళ్ళు వేసే మెతుకులు తినలేక బయటికి వచ్చేసానని యూట్యూబ్ లో సుమన్ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కిర్రాక్ ఆర్పి చేసిన తీవ్ర విమర్శలు బాగా వైరల్ అయ్యాయి. జబర్దస్త్ ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వడం కాదు మేమే జబర్దస్త్ కు జీవితాన్ని ఇచ్చాము అంటూ కామెంట్స్ చేసాడు ఆర్పి. అక్కడ ఎవరినీ మనుషుల్లా చూడరు అంటూ మల్లెమాల సంస్థను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఇక వీరికి కౌంటర్ ఇస్తూ రామ్ ప్రసాద్, హైపర్ ఆది ఇంటర్వ్యూ లో పాల్గొని ఆర్పి ఆరోపణలు అపద్ధాలు అంటూ చెప్పారు.

జబర్దస్త్ లో టీం లీడర్లు ఎవరైనా నా మాట నిజం కాదంటే గుండు గీయించుకుంటా…

ఇక షేకింగ్ శేషు కిర్రాక్ ఆర్పి ని వ్యక్తిగతంగా ఫ్రాడ్ అంటూ మాట్లాడాడు. ఒక నిర్మాతను మోసం చేసాడని, ఇల్లు ఫేక్ అంటూ మాట్లాడాడు. ఇక వీటి మీద కిర్రాక్ ఆర్పి బూతులతో విరుచుకుపడ్డాడు. వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వ్యక్తిగతంగానే విమర్శిస్తాను అంటూ దూషించాడు. ఇక నిర్మాతను ఇరవైలక్షలు ఖర్చుపెట్టించి మోసం చేసానని శేషు అన్నాడు కానీ అది ఇరవై లక్షలు కాదు 70 లక్షల పైనే అంటూ దానికి వివరణ ఇచ్చాడు. ఇక తన ఇల్లు ఫేక్ అని చూపించుకోవాల్సిన అవసరం లేదని కావాలంటే ఇంటి పత్రాలు చూపుతానంటూ మాట్లాడాడు.

ఇక హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లు కిర్రాక్ ఆర్పి చెప్పినవి అపద్దాలు అనగా జబర్దస్త్ లో ఉన్న వాళ్ళే కొంతమంది నాకు ఫోన్ చేసి బాగా అన్నావ్, మేము అనలేని మాటలని నువ్వు అంటున్నావ్ అన్నారు. నేను రికార్డింగ్ వాట్సాప్ మెసేజెస్ కూడా చూపగలను అంటూ చెప్పాడు ఆర్పి. నేను ఉన్న సమయంలోని టీం లీడర్ గా ఉన్న ఏ వ్యక్తి అయినా నా ముందుకు వచ్చి ఇవన్నీ అపద్దాలే ఇందులో ఒక్కటి కూడా నిజం లేవని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ప్రమాణం చేస్తే నేను గుండు గీయించుకుంటా ఆ క్షణమే అంటూ సవాల్ విసిరాడు కిర్రాక్ ఆర్పి.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago