Featured

Thottempudi Venu : పూరి జగన్నాథ్ దేశముదురు సినిమా నాతో చేస్తానని మోసం చేశాడు : వేణు తొట్టెంపూడి

Thottempudi Venu : తొట్టెంపూడి వేణు… స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని నటనకు స్పెషల్ జూరి నంది అవార్డును సంపాదించాడు. విక్టరీ వెంకటేష్ తరువాత ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా సినిమా రంగానికి దూరంగా వున్న వేణు, తాజాగా రవితేజ హీరోగా వడ్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్వరలోనే సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే అలీ హోస్ట్ గా వ్యవహారిస్తున్న అలీ తో సరదాగా కార్యక్రమం లో పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రాం యొక్క ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.

దేశముదురు సినిమా మొదట నాతో చేస్తానన్నారు…

ఈ ప్రమోలో వేణు, నా ఫస్ట్ సినిమా నుండి అలీ గారు నాతోనే వున్నారు, నేను వేసుకున్న చొక్కా కూడా అయనదే అని చెప్తు సరదాగా మాట్లాడారు. మొదటి సినిమా భారతి రాజా తో చేయాల్సినింది కదా ఎందుకు మిస్ అయ్యింది అని అలీ అడుగగా….దీనికి సమాదానంగా వేణు, సర్ నేను బాగా యాక్ట్ చేస్తాను అని ఏవేవో ఆయనకు చేసి చూపించాను, తరువాత ఒకరోజు ఆయన నన్ను పట్టుకొని నేనే మొదటి సినిమా చేయాల్సిన్నింది, అని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు అని చెప్పారు.

పెళ్లి గురించి టాపిక్ తెచ్చి మీది లవ్ మ్యారేజా లేకపోతే ఆరెంజ్డ్ మ్యారేజా అని అడుగగా దాని వేణు చెప్పిన సమాధానం చూపించకుండా ప్రమోలో సస్పెన్స్ పెట్టారు. ఆ తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నేను చేయకపోయినా నాలో పూరి జగన్నాథ్ కి ఏం నచ్చిందో తెలియదు కానీ దేశముదురు సినిమా నాతో చేస్తానని వచ్చారు, దాని గురించి డిస్కస్ చేసాం కానీ ఎందుకో నాతో చేయలేదు అని చెప్పారు. అలీ మీరు చాలా రిచ్ అని, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందని అనుకుంటున్నారు నిజమా అని అడుగగా…. మా అమ్మ గారి తమ్ముడు మాగంటి అంకినీడు, ఎంపీ గా చేశారు. నేను మేనల్లుడు కావడంతో నీ సినిమా ఆడితేనే నేను నీగురించి చెప్పుకుంటాను అనేవాడు అని చెప్పుకొంచ్చారు. అయితే మీరుకూడా రాజకీయాల్లోకి వస్తారా అని అడుగగా… తప్పనిసరిగా అని వేణు చెప్తుండగా ప్రోమో ఎండ్ చేసి సస్పెన్స్ లో పెట్టారు. ఇక ఇవన్నీ తెలియాలంటే ఎపుసోడ్ వచ్చే వరకు వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago