Categories: FeaturedMovie News

Kithakithalu fame Geetha singh : ఆ సినిమా కోసం 11 సినిమాలను వదులుకున్నాను… ఆ డైరెక్టర్ కే ఫోన్ చేస్తే… ఆ రోజు చాలా బాధపడ్డాను : గీతా సింగ్

Kithakithalu fame Geetha singh : ‘ఎవడి గోల వాడిది’ సినిమాతో కమెడియన్ గా అడుగుపెట్టిన గీతా సింగ్ అంతకు ముందు తేజ గారి సినిమా ‘జై’ లో నటించింది. ఇక ఎవడిగోల వాడిది, సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఏకంగా ‘కితకితలు’ సినిమాతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా క్రేజ్ తో వరుసగా సినిమాలను చేసిన గీతా సింగ్ దాదాపు ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలలో ఎక్కువగా కనిపించని గీత గ్యాప్ రావడానికి గల కారణాలను వివరిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ డైరెక్టర్ కే నేరుగా ఫోన్ చేశా…

గ్యాప్ రావడానికి కారణం ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఎమోషనల్ అయిన గీతాసింగ్ అమ్మ పాత్రకు సరిపోనని అంటున్నారు, అక్క పాత్రలకు నప్పను అంటున్నారు, మీరు కామెడీ పాత్రలు చేయగలరు అవే చేయండని చెబుతున్నారు. పోనీ కామెడీ పాత్రాలనైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు, మన వాళ్లే ఎంతో మంది ఆర్టిస్టులు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు కానీ ఇండస్ట్రీలో మమ్మల్ని తీసుకోరు. మరికొన్నిసార్లు అవకాశం ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో లేదని చెప్పేస్తారు.

ఒక పెద్ద డైరెక్టర్ సినిమాలో అవకాశం ఇస్తామని వారి అసిస్టెంట్ డైరెక్టర్లు ఫోన్ చేస్తే ఆ ఆఫర్ కోసం 11 సినిమాలను వద్దనుకున్నాను. పాసుపోర్టు అడిగారు, ఇంతవరకు ఫోన్ చేయలేదని నేనే మళ్ళీ కాల్ చేస్తే వేరే వాళ్ళని మీ పాత్రకి తీసుకున్నారు అని చెప్పారు. డైరెక్టర్ గారికి కాల్ చేస్తే నాకసలు మిమ్మల్ని అడిగిన సంగతి తెలియదు అని చెప్పాడు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ పేరు చెప్పను అంటూ గీతా సింగ్ చెప్పారు. ఆ ఒక్క సినిమా కోసం 11 సినిమాలు పోయాయి ఎంతో కొంత డబ్బు వచ్చేది కదా అంటూ బాధపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago