Featured

మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందా.. లేదా అనేది ఇలా తెలుసుకోండి..

ప్రస్తుతం దాదాపు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉన్నావాళ్లు తమ ఆధార్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిందా లేదా అనేది చాలా మందికి తెలియదు. దాని కోసం ఏం చేయాలంటే.. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. బ్యాంక్ అకౌంట్ పని చేయకపోవచ్చు కూడా.

అందువల్ల రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలుసుకోవడానికి మీ ఆధార్‌లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయి ఉండాలి. ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయనట్టైతే ఈ వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాదు.

ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. అది ఆధార్ కార్డుల‌ను జారీ చేసే యూఐడీఏఐ వెబ్‌సైట్‌. దాన్ని ఓపెన్ చేశాక‌.. Aadhaar Services అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే మ‌రో పేజి ఓపెన్ అవుతుంది. అక్క‌డ Aadhaar Linking Status అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాని కింద Check Aadhaar/Bank Linking Status అనే లింక్ ఉంటుంది.

దాని మీద క్లిక్ చేస్తే మ‌రో పేజి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు మీకు కనిపిస్తాయి. బ్యాంక్ లింక్ స్టేట‌స్‌, లింక్ అయిన తేదీ.. అన్నీ అక్క‌డ క‌నిపిస్తాయి. ఒక‌వేళ ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకులు లింక్ అయినా అన్ని బ్యాంకుల వివ‌రాలు అక్క‌డ ఉంటాయి. ఇలా పైన చెప్పిన విధంగా సులువుగా తెలుసుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

2 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

2 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

2 hours ago

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

10 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago