ప్రస్తుతం దాదాపు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉన్నావాళ్లు తమ ఆధార్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిందా లేదా అనేది చాలా మందికి తెలియదు. దాని కోసం ఏం చేయాలంటే.. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. బ్యాంక్ అకౌంట్ పని చేయకపోవచ్చు కూడా.

అందువల్ల రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలుసుకోవడానికి మీ ఆధార్‌లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయి ఉండాలి. ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయనట్టైతే ఈ వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాదు.
ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. అది ఆధార్ కార్డులను జారీ చేసే యూఐడీఏఐ వెబ్‌సైట్. దాన్ని ఓపెన్ చేశాక.. Aadhaar Services అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే మరో పేజి ఓపెన్ అవుతుంది. అక్కడ Aadhaar Linking Status అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద Check Aadhaar/Bank Linking Status అనే లింక్ ఉంటుంది.
దాని మీద క్లిక్ చేస్తే మరో పేజి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు మీకు కనిపిస్తాయి. బ్యాంక్ లింక్ స్టేటస్, లింక్ అయిన తేదీ.. అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు లింక్ అయినా అన్ని బ్యాంకుల వివరాలు అక్కడ ఉంటాయి. ఇలా పైన చెప్పిన విధంగా సులువుగా తెలుసుకోవచ్చు.






























