Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…