Categories: FeaturedMovie News

Kommanapalli Ganapathi Rao : సౌందర్య నా దగ్గర రెండు లక్షలు కొట్టేసే సీన్… వాణిశ్రీ అలిగి వెళ్ళిపోతే నేను వెళ్లి తీసుకువచ్చాను…: కొమ్మనాపల్లి గణపతి రావు

Kommanapalli Ganapathi Rao : నవలా రచయితగా రాసింది కొన్ని నావలలే అయినా అవన్నీ ప్రేక్షకాదరణ పొందిన నవలలే. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరో వైపు సాహిత్యరంగంలో కృషి చేసారు. ఇక ఆయన ‘హంసధ్వని’ అనే నవలను సీరియల్ రూపంలో పత్రికకు రాస్తున్న సమయంలో ఆయన రచనలు నచ్చి నిర్మాత కాట్రగడ్డ మురారి గారు ఆయనను సినిమా రంగానికి పరిచయం చేసారు. శోభన్ బాబు హీరో గా వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమాకు మొదటి సారి పనిచేసారు. దాసరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. కుటుంబ కథా రచయితగా మంచి గుర్తింపు ఉన్న కొమ్మనపల్లి ఆయనకు నచ్చని పని చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పడం వల్ల ఇండస్ట్రీలో శత్రువులను కూడా పెంచుకున్నారట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయిత డైరెక్టర్ ను ఇండస్ట్రీకి అందించింది ఈయనే.

వాణిశ్రీ నాకు చాలా క్లోజ్… సౌందర్య తాగేటపుడు అలా చెప్పేది…

కొమ్మనాపల్లి గారు తన కెరీర్ సినిమాల గురించి మాట్లాడుతూ హీరోయిన్లలో సావిత్రి, వాణిశ్రీ అంటే చాలా ఇష్టమంటూ తెలిపారు. రచయితగా పనిచేస్తున్న సమయంలో వాణిశ్రీ గారు పరిచయమై బాగా క్లోజ్ అయ్యారంటూ తెలిపారు. తాను పెళ్లిచేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమయంలో అందరి మీద చాలా కోపంతో ఉండేవారు. సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా కొంచెం తేడా జరిగినా అలిగి వెళ్లిపోయేవారు. ఆ సమయంలో నిర్మాతలు డైరెక్టర్లు నా దగ్గరికి వచ్చి వెళ్లి మేడంను పిలుచుకురా, నీ మాట వింటారు అని పంపేవారు. నేను వెళ్లి మీకు చాలా జాలి ఎక్కువ, ఇలా అలగడం వల్ల నిర్మాతకు నష్టం అని మళ్ళీ సాయంత్రానికి మీరే బాధపడతారు అవసరమా రండి మీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు అని చెబితే నిజామా గణపతి రావు అని అమాయకంగా అడిగేవారు. చాలా మంచి మనిషి వాణిశ్రీ అలాగే తనకు చాలా విషయాల్లో పట్టు ఉంది అంటూ తెలిపారు కొమ్మనాపల్లి.

ఇక సౌందర్య కూడా గొప్ప నటి అంటూ చెబుతూ చాలా గౌరవం ఇస్తుంది ఎదుటి వ్యక్తులకు అంటూ ఆమెతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ‘మాయదారి కుటుంబం’ అనే సినిమాలో సౌందర్య దొంగగా నటించింది. ఆ సమయంలో ఒక రైటర్ దగ్గర రెండు లక్షల డబ్బులు కొట్టేసే సీన్ ఉండగా ఆ సీన్ రాస్తున్నప్పుడు వచ్చి మీరే ఆ సీన్ లో రైటర్ గా నటించవచ్చు కాడా అని అడిగింది. సౌందర్య తండ్రి డైరెక్టర్ అలానే నా నవలలను కన్నడలోకి తర్జుమా చేసారు అలా ముందు నుండి పరిచయం ఉంది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago