Categories: FeaturedMovie News

Subbaraya Sharma : బ్రాహ్మానలను వెకిలి చేస్తే నచ్చదు… అన్నపూర్ణమ్మకు విషం పెట్టి చంపాలన్నారు…: సుబ్బరాయ శర్మ

Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ‘ఒంటెద్దు బండి’ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయనకు ఎన్నో అవార్డులు, ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

బ్రాహ్మణులను వెకిలి చేస్తే నచ్చదు…

చాలా సినిమాల్లో దేవుడి అర్చకుడిగా చేసిన సుబ్బరాయ శర్మ గారు అర్చకుడి వేషాలను వచ్చినా చాలా సినిమాల్లో ఆయన చేయలేదు. దీనికి కారణం కేవలం గుడిలో పూజారిగా ఏదో పూజ చేసి ప్రసాదం పెట్టే పాత్ర చేయకూడదు అనే ఉదేశంతో చేయలేదట. ఏదో ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్ర అయితే చేయొచ్చు కానీ ప్రాముఖ్యత లేకుండా కేవలం పూజ చేసే పాత్ర ఎందుకు చేయాలని అనిపించింది. నటన మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చాను, డబ్బు కోసం కాదు అని సుబ్బరాయ శర్మ గారు అభిప్రాయపడ్డారు. ఇక సింహాద్రి, పంచాక్షరీ వంటి సినిమాల్లో అర్చకుడి పాత్ర చేసినా అందులో ప్రాముఖ్యత ఉంది అందుకే చేశాను అంటూ చెప్పారు.

ఇక నెగెటివ్ షేడ్ పాత్రలో నటించకపోడానికి గల కారణాలను వివరిస్తూ ఎక్కువగా మంచి క్యారెక్టర్ లో చూడటం వల్ల నెగెటివ్ షేడ్ నేను చేయను అని డైరెక్టర్లు భావించి ఉండవచ్చు. ఇక ముత్యాల సుబ్బయ్య గారు మాత్రం ఆయన డైరెక్టర్ గా తీసిన సినిమాల్లో నాకు నెగెటివ్ షేడ్ వేషం ఇచ్చారు. అందులో అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ గారిని విషం పెట్టి చంపే పాత్రలో నటించాను. ఆ పాత్రలో నన్ను జనాలు ఒప్పుకోరేమో అనుకున్నాను, ఇదే విషయం ముత్యాల సుబ్బయ్య గారితో చెబితే ఆయన ఇంతవరకు మంచి పాత్రల్లో నిన్ను చూసిన ప్రేక్షకులు నువ్వు ఇలాంటి నెగెటివ్ షేడ్ చేయవని అనుకోరు అందుకే నిన్ను పెట్టాలనుకున్నాను అని చెప్పారు అంటూ సుబ్బరాయ శర్మ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago