Categories: FeaturedMovie News

Kona Venkat : గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి అడిగాడు : కోన వెంకట్

Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. తాజాగా మళ్ళీ రైటర్ గా పూర్తి బాధ్యత తీసుకుని సూర్య డైరెక్షన్ లో వస్తున్న విష్ణు సినిమాతో వస్తున్నారు.

గబ్బర్ సింగ్ విషయంలో పవన్ నన్ను టెస్టు చేసాడు…

పవన్ కళ్యాణ్ బాలు సినిమా అప్పటి నుండి బాగా తెలుసు. అయితే గుడుంబా శంకర్ సమయంలోనే నాగబాబు గారు పరిచయం అయ్యారు. ఇక బాలు సినిమా అప్పటి నుండి నాకు పవన్ కి మధ్య స్నేహం మొదలయింది. నేను పవన్ కళ్యాణ్ ను సొల్ మేట్ అని పిలుస్తాను. అదేదో ఫ్యాషన కోసం నేను అలా పిలవను నాకు నిజంగా మా ఇద్దరి భావాలు కలిసాయి అనిపించింది కాబట్టే అలా పిలుస్తాను.

పవన్ అంటాడు ఒక చిన్న పరిచయం కూడా విధి రాసిపెట్టుంటే జరుగుతుంది అని మనం కలవడం కూడా విధే అని చెప్పాడు. ఇక తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో నన్ను రామోజీ ఫిల్మ్ సిటీ కి పిలిచాడు. అక్కడ మాట్లాడుతూ దబాంగ్ రీమేక్ చేయాలనుకుంటున్నాను. ఏ డైరెక్టర్ తో చేయాలో సలహా చెప్పు అని నలుగురు డైరెక్టర్ల పేర్లు చెప్పగా అందులో హరీష్ శంకర్ పేరు ఉండగా కోన గారు హరీష్ పేరు చెప్పారట. ఇక పవన్ నా మనసులో కూడా అదే పేరు ఉంది మిరపకాయ్ సినిమా అప్పుడే ఆ సినిమా కథ చెప్పాడు, అయితే నేను చేయలేకపోయాను. ఆ విషయంలో బాధపడ్డాను అందుకే తనతో సినిమా చేయాలని అనుకున్నాను నువ్వు కూడా అదే పేరు చెప్పావ్ నేను నిన్ను టెస్టు చేశా ఏ పేరు చెప్తావా అని కోన గారిని అన్నారట. అయితే ఈ సినిమా తనతోనే చేస్తా అని చెప్పాడట. ఇక హరీష్ శంకర్ ను పిలిచి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేస్తున్నాం అని చెప్పాడు, అది నాకు చాలా ఆనందంగా అనిపించింది అంటూ కోన గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago