Movie News

Kona venkat : జెనీలియాకి ఆ సినిమా కథ చెప్పి ఒప్పించా… అది ఫ్లాప్ అయ్యేసరికి నన్ను బాగా తిట్టుకుంది : కోన వెంకట్

Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు.

జెనిలియా ని కథ చెప్పి ఒప్పించా…

కోన వెంకట్ తన సినిమా ప్రయాణంలో విశేషాలను వివరిస్తూ తాను ఏంబిఏ మార్కెటింగ్ చేయడం వల్ల ఎదుటివారిని ఒప్పించడం బాగా తెలుసనీ వెంకటేష్ నటించిన సుభాష్ చంద్ర బోస్ సినిమా విషయంలో నాకు కథను పది నిమిషాల్లో చెప్తే నేను దాన్ని అర్ధగంటకు పొడిగించుకుని జెనిలియాకు చెప్పి సినిమాలో నటించేందుకు ఆమెను కన్విన్స్ చేశాను. ఆ సినిమా విడుదల అయ్యాక సినిమా ఫ్లాప్ అయింది.

దాంతో నన్ను జెనిలియా బాగా తిట్టుకుంది. ఎదుటివారిని బాగా ఒప్పించిగల టాలెంట్ నాకుందని నమ్మే డైరెక్టర్లు కథ చెప్పడానికి నన్ను పంపుతారు అంటూ చెప్పారు. ఇక చిరంజీవి గారు వెంకీ సినిమా తరువాత ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి అభినందించడం జీవితంలో మర్చిపోలేను. అది వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది ఒక వ్యక్తికి అంటూ చెప్పారు కోన వెంకట్.

Bhargavi

Recent Posts

ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బాహుబలి 3’ రానుందంటూ ప్రకటన..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…

4 hours ago

‘పెద్ది’ ప్రభావమా..? చరణ్-సుకుమార్ సినిమాకు బడ్జెట్ కత్తెర..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…

5 hours ago

తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…

7 hours ago

పల్లీ వర్సెస్ బాదం..ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్?

ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే పదార్థాల్లో బాదం, వేరుశెనగలు తప్పకుండా ఉంటాయి. చాలా మంది ప్రతి రోజు…

7 hours ago

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

1 day ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

1 day ago