Konda Surekha : కొండా సినిమా విడుదలయ్యాక పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కొండా సురేఖ అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి అనుచరులుగా ఆయన చనిపోయేంత వరకు ఆయనతో ఉన్న కొండా దంపతులు ఆ తరువాత జగన్ కు సపోర్ట్ చేసారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు చేయడమే కాకుండా మంత్రి పదవికి రాజీనామా కూడా చేసారు. ఇక తెలంగాణ రాష్ట్రం విడిపోయాక కొండా దంపతులు తెరాస లో చేరిపోయారు. ఆ తరువాత అక్కడి నుండి కూడా బయటికి వచ్చేసారు.
షర్మిల తో ఆస్తి గొడవలు…
ఇక ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతున్న సురేఖ జగన్ కుటుంబం లో జరుగుతున్న విషయాలను చెప్పారు. జగన్ మీద ఉన్న అక్రమాస్థుల కేసుల వల్ల జైలు కి వెళ్లాల్సి వస్తే తన బదులుగా సీఎం గా షర్మిల సీఎం అవ్వాలన్నది తల్లి విజయమ్మ కోరిక కానీ అది జగన్ కి ఇష్టం లేదు. అదికాక వాళ్ల మధ్య ఆస్తుల గొడవలు రావడంతో ఆమె వైసీపీ నుండి బయటికి వచ్చి తెలంగాణ కోడలిగా అక్కడ పార్టీ పెట్టారు అంటూ చెప్పింది సురేఖ. ఇక షర్మిల నిర్ణయం తప్పని ఆమె భావించారు.
‘పార్టీ పెట్టి రాజకీయాల్లో ఉండాలని అనుకునుంటే తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లోనే పెట్టాల్సింది లేదా తన తండ్రి ఉన్న పార్టీ కాంగ్రెస్ లో చేరాల్సింది. తండ్రి ఆశయాలు అన్నపుడు ఆయన చివరి శ్వాస వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ లో చేరి ఆయన ఆశయాలను నెరవేర్చాల్సింది . రాజశేఖర్ రెడ్డి కూతురు అని చెప్పొచ్చు కానీ ఆయన ఆశయాల కోసం అని మాత్రం చెప్పకూడదు. ఆయన ఆశయాలు అంటే కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ఆలోచనలు వస్తాయి కాబట్టి’ అంటూ జగన్ కుటుంబ విషయాలలో గురించి మాట్లాడారు కొండా సురేఖ. ఇక షర్మిల పార్టీ వల్ల తెరాస ఓట్లు చీలవు కానీ కాంగ్రెస్ ఓట్లు చీలుతాయి. కాంగ్రెస్ లో ఉండే రాజశేఖరరెడ్డి అభిమానులు షర్మిల కు ఓట్లు వేసే అవకాశం ఉంది. దీని వల్ల తెరాస కు లాభామవుతుంది అంటూ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ…
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే కొన్ని రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి…
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా ఇళ్లలో కట్టెలు, పిడకలు వంటి సంప్రదాయ ఇంధనాలతోనే వంట చేస్తున్నారు. అయితే ఈ విధంగా…
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ఘనంగా జరిగిన ఆస్కార్ అవార్డులు వేడుకలో భారత సినీ రంగానికి చెందిన పలువురు దిగ్గజాలను…
భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎల్‌పీజీ ట్యాంకర్ శివాలిక్ ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా గుజరాత్‌లోని **ముంద్రా పోర్టు**కు చేరుకుంది. ఖతార్ నుంచి…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. మొదట ‘బ్యాటిల్…