Movie News

పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన.. నటుడు కోట శ్రీనివాసరావు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఒక అద్భుతమైన నటుడిగా, కమెడియన్ గా, విలన్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి అందరిని మెప్పించిన నటుడు కోటశ్రీనివాస రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అద్భుతమైన నటనకు పద్మ శ్రీ పురస్కారం కూడా లభించింది. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన నటుడు కోట శ్రీనివాసరావు ప్రస్తుతం ఇంటికి పరిమితమయ్యారు.

కోట శ్రీనివాస్ రావుకు వయసు పైబడటంతో అతనికి ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే కోటశ్రీనివాస్ రావు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తనకు వయస్సు పైబడిన నటించాలనే కోరిక ఉందని, వయసు పైబడితే కేవలం వళ్ళు నొప్పులు వంటివి రావడం సర్వసాధారణమేనని అయితే తనకు నటించాలనే కోరిక ఇప్పటికి ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం పవన్ కళ్యాణ్, చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటివారిని సినిమాలలో అవకాశం ఇవ్వమని అడిగానని తెలిపారు. ఇలా అవకాశాలు ఇవ్వమని అడగడం తన దృష్టిలో ఏ మాత్రం తప్పు కాదని ఒక నటుడిగా తనకు అవకాశాలు ఇవ్వమని అడగడం తన దృష్టిలో తప్పు కాదని తెలియజేశారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం తనని తీసుకున్నారని.. ఇలా ఈ వయసులో కూడా సినిమా అవకాశాలను అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలో తనకు ఆఫర్ ఇచ్చారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కోట శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago