KR Vijaya : దేవత పాత్రలు అనగానే ఒక్కప్పటి సినిమాల్లో గుర్తు వచ్చేది కేఆర్ విజయ గారు, ఆమె పెద్ధ కళ్ళు అందమైన ముఖ వర్చస్సు వల్ల అమ్మవారి రూపంలో చక్కగా కనిపించేవారు. ఇక హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో మొదటగా ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాతో గుర్తింవు తెచ్చుకున్నా ఆమె తమిళంలో తన కెరీర్ మొదలు పెట్టారు. ఇక కేరళ కు చెందిన ఈమె తండ్రిది మాత్రం చిత్తూరు జిల్లా కావడం విశేషం. ఇక తెలుగులో వందకు పైగా సినిమాలలో నటించిన విజయగారు ఎక్కువగా తమిళంలోనూ ఆపైన తెలుగు, మలయాళం లో నటించారు. ఆమె వ్యక్తిగత విషయాలను అలాగే కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
ఆ సాంగ్ లో ఇద్దరం కింద పడిపోయాం…
విజయ గారు తెలుగులో అందరు అగ్రహీరోలతోనూ హీరోయిన్ గా నటించారు. ఎన్టీఆర్ గారితో, కృష్ణ, శోభన్ బాబు గారితో ఎక్కువ సినిమాల్లో నటించిన ఆమె అప్పటి విశేషాలను తెలిపారు. కృష్ణ గారితో ‘అసాధ్యుడు’ సినిమాలో నటించిన ఆమె అందులో జరిగిన ఒక సంఘటన గురించి తెలిపారు. అసాధ్యుడు సినిమాలో ఒక సాంగ్ లో విజయ గారిని కృష్ణ గారు ఏడిపించాలి.
అయితే ఆ సాంగ్ కి ముందు గుర్రపు బండిలో ఇద్దరూ వెళ్లే సీన్ ఉండగా ఆ సీన్ షూటింగ్ లో గుర్రం వెనక్కి లేవడంతో కృష్ణ గారు నేను ఇద్దరం బండితో సహా కిందకి పడ్డాము అయితే దెబ్బలు పెద్దగా తగలలేదంటూ చెప్పారు. ఇక అగ్ర నటులందరూ ఒక్కొక్కరిగా మరణిస్తున్నారు, చాలా బాధగా ఉంది అంటూ విజయ గారు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…