Krishna: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా దర్శకుడిగా పలు సినిమాలను నిర్మించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే ప్రస్తుతం ఈయన సినిమాలు తీయకపోయినా సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు గురించి కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తమ్మారెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినిమాల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తమ్మారెడ్డి కృష్ణ గారి అభిమానుల గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. కృష్ణ గారి అభిమానులు తన ఆఫీసు పై దాడి చేయడంతో ఈయన తన అభిమానులపై కేసు పెట్టారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తనకు ప్రశ్న ఎదురైంది. మీరు ఇలా అభిమానులపై కేసు పెట్టినప్పుడు కృష్ణ గారు మీపై వారిని విడిపించాలి అని ఏమైనా ఒత్తిడి తీసుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ నేను కేసు పెట్టినప్పటికీ కృష్ణ గారు మాత్రం ఒక్క మాట కూడా ఆ విషయం గురించి నాతో మాట్లాడలేదని, నాపై ఒత్తిడి తీసుకు రాలేదని తమ్మారెడ్డి వెల్లడించారు.
ఇలా తన అభిమానులపై కేసు పెట్టినప్పటికీ కృష్ణ గారు ఆ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదని, ఇలా ఒక సంవత్సరం తర్వాత ఆ కేసు రద్దయిందని ఈయన తెలియజేశారు.కృష్ణ గారి గురించి ఆయన మంచితనం గురించి ఇంటర్వ్యూ సందర్భంగా తమ్మారెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…