Categories: FeaturedMovie News

Krishna house maid lakshmamma : నలభై ఏళ్ళు వాళ్ళ దగ్గర పనిచేశా.. నన్ను ఏమని పిలుస్తారంటే… నా కష్టాలను చూసి వాళ్ళు ఏమి చేసారంటే : కృష్ణ గారి పనిమనిషి లక్ష్మమ్మ

Krishna house maid lakshmamma : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించాక ఆయనకు ఇప్పటికీ ఎంత మంది అభిమానులు ఉన్నారో ఇప్పటి తరం వారికి అర్థమైంది. ఒక చేత్తో చేసిన సహాయం ఇంకో చేతికి తెలియకూడదు అంటారు అలా ఎంతో మందికి సహాయం చేసి ఆదుకున్నారు. ఆలాంటి విషయాలన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. కృష్ణ గారి పద్మాలయా స్టూడియోలో హౌస్ కీపర్ గా పనిచేసిన లక్ష్మమ్మ అనే పనిమనిషి కుటుంబానికి కృష్ణ గారు అలాగే విజయనిర్మల గారు చేసిన సహాయం గురించి ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె కూతుర్లను తమ కూతుర్లుగా చూసి బాధ్యతగా వారే పెళ్లి చేయించి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు కూడా చేసినట్లు చెప్పారు.

మా కుటుంబ కష్టాలను తీర్చారు…

ఒకే మనిషి నలభై ఏళ్లుగా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. కృష్ణ గారి పద్మాలయా స్టూడియోస్ లో లక్ష్మమ్మ అనే హౌస్ కీపర్ అక్కడే దాదాపు నలభై ఏళ్లుగా పనిచేసింది. ఆమె అక్కడ ఆఫీస్ లో పనిచేసే సమయంలో కృష్ణ గారు వచ్చినా నీ పని చెయ్ లక్ష్మమ్మ నేను వెయిట్ చేస్తా అని చెప్పేవారట. అంత పెద్ద హీరో ముందు నిలబడి ఉంటే భయం వేసేది కానీ కృష్ణ గారు చాలా ఆప్యాయంగా ఎవరినైనా మాట్లాడిస్తారు అంటూ లక్ష్మమ్మ తెలిపారు. ఒక మూడేళ్ళ నుండి కాలు విరగడంతో పని మానేసినా ఆమె కూతుర్లు కోడళ్ళు పనికి వెళ్లడం అక్కడే పని చేయడం విశేషం. కృష్ణ గారి కుటుంబం లక్ష్మమ్మ కుటుంబంలో ఏ కష్టమొచ్చినా మేము ఉన్నాం అని ఆదుకున్నారు అంటూ నేడు కృష్ణ విజయనిర్మల ఇద్దరూ దూరమయ్యారు అంటూ ఎమోషనల్ అయింది లక్ష్మమ్మ.

తన కూతుర్ల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా బంగారం పెట్టి పంపారని ముగ్గురు కూతుర్ల పెళ్లిళ్లకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి బంగారం పెట్టి వాళ్ళ పెళ్ళికి వచ్చి దీవించి వెళ్లారని అంతేకాకుండా మనవళ్ళు, మానవరాళ్ల పెళ్లిళ్ల బాధ్యత కూడా తీసుకున్నారని చెప్పింది లక్ష్మమ్మ. ఇక వాళ్ళింట్లో పండగ అయినా ఏదైనా ఫంక్షన్స్ అయినా మాకు డబ్బులు ఇస్తారని చెప్పింది. ఇల్లు కట్టుకోడానికి స్థలం విషయంలో కూడా వాళ్ళే సహాయం చేశారని వాళ్ళు లేకపోయినా వాళ్ళ వల్లే మేము బతుకుతున్నామని ఎమోషనల్ అయింది లక్ష్మమ్మ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago