Krishna:టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర అనారోగ్య సమస్యతో మరణించిన సంగతి తెలిసిందే.ఇలా మంగళవారం మరణించడంతో బుధవారం సాయంత్రం ఈయన అంత్యక్రియలలో ఎంతో మంది అభిమానులు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో పూర్తి చేశారు.
మహేష్ బాబు తన తండ్రికి దహన సంస్కరణ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేశారు.ఈ విధంగా మహేష్ బాబు ఒక ఏడాదిలోనే తనకు ఎంతో ఆప్తులైనటువంటి తల్లి తండ్రి అన్నయ్యను కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఈ విధంగా మహేష్ బాబు తన ఆప్తులని కోల్పోవడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన అభిమానుల సైతం ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే అయిదు దశాబ్దల సినీ కెరియర్లో కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎన్నో సినిమాలకు దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఇలా సినిమాల ద్వారా కృష్ణ ఏకంగా 400 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులను కూడా పెట్టినట్టు సమాచారం. ఇక కృష్ణ మరణం తర్వాత తన ఆస్తిలో మహేష్ బాబుకు రూపాయి కూడా దక్కకుండా వీలునామా రాశారట.
ఈ విధంగా కృష్ణ తన ఆస్తులన్నింటినీ మహేష్ బాబు పేరు పై కాకుండా తన ఆస్తి మొత్తం తన మనవల్లు, మనవరాళ్ళకు చెందెలా వీలునామా రాశారనీ తెలుస్తోంది. ఇక ఈయన నరేష్ కి సైతం తన ఆస్తిలో వాటా లేకుండా చేశారట. విజయనిర్మల ఆస్తులు మొత్తం నరేష్ కి చెందాయని అందుకే కృష్ణ తన ఆస్తిలో నరేష్ కు ఎలాంటి వాటా ఇవ్వలేదని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…