Featured

Krishna Kumari : సబిత ఇంధ్రారెడ్డి ఆ స్కూల్ ను సీజ్ చేసి తప్పు చేసిందా… ఆ డ్రైవర్ భార్యను ఏం చేసాడంటే : సామాజిక వేత్త కృష్ణకుమారి

Krishna Kumari : నాలుగేళ్ళ చిన్నారి పై లైంగిక వేధింపులకు పాల్పడిన స్కూల్ డ్రైవర్ ను అరెస్ట్ చేసారు. ఇక ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి ని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇక తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి బంజారాహిల్స్ లోని దావ్ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు కూడా చేసింది. అయితే ఈ ఘటన వల్ల మిగిలిన విద్యార్థులు నష్టపోతారు అని వాదన వినిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం చాలా త్వరగా స్పందించి చర్యలు తీసుకోవడం హర్షనీయమే అయినా స్కూల్ గుర్తింపు రద్దు తొందరపాటు చర్య అవుతుంది అంటూ సామాజిక వేత్త కృష్ణకుమారి అభిప్రాయపడ్డారు.

మిగిలిన పిల్లల సంగతి ఏమిటి…

సామాజిక వేత్త కృష్ణ కుమారి మాట్లాడుతూ స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే డ్రైవర్ మీద చర్యలు తీసుకోవడం మంచి నిర్ణయమే కానీ స్కూల్ గుర్తింపు రద్దు చేయడం అనేది మంచి నిర్ణయం కాదు అంటూ చెప్పారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు మేము ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాం అంటున్నారు కానీ మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి, ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల మిగిలిన విద్యార్థులు నష్టపోతారు. ఆ చుట్టూ పక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్కూల్స్ ఆ విద్యార్థులను చేర్చుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు కానీ విద్యా సంవత్సరం మధ్యలో ఇంకో స్కూల్ కి వెళితే పిల్లల పరిస్థితి ఏమిటి, కొత్త స్కూల్ కి అలవాటు పడాలి, టీచర్స్ కి అలవాటు పడాలి, ఇక కొత్త యూనిఫామ్స్ ఇవన్నీ పేరెంట్స్ కి కూడా భారమే కదా ఇవన్నీ అలోచించి మంత్రి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది.

ఇక స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం గురించి మాట్లాడుతూ ఆమె అతి గుడ్డిగా ఆ డ్రైవర్ ను నమ్మింది, ప్రిన్సిపాల్ తరువాత ఆ స్కూల్ లో ఆ డ్రైవర్ పెత్తనం చెలాయిస్తున్నాడంటే ఆమె అతన్ని ఎంత నమ్మిందో అర్థమవుతోంది. ఒక స్కూల్లో నియామకాలు జరిగినపుడు వారి పూర్వపరాలు విచారించి చేర్చుకోవాలి. ఆ డ్రైవర్ మొదటి భార్యను కట్నం కోసం వేధించాడని అతని మీద వరకట్న వేధింపుల కేసు కూడా ఉంది, ఇలాంటివి చూసుకోకుండా అతన్ని పనిలో పెట్టుకున్నారు. ఒక సంస్థలో ఉద్యోగానికి చేర్చుకునే ముందు అతని బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు విద్యాసంస్థలను తనిఖీ చేస్తే కొంతవరకు ఇలాంటి ఘటనలను నిర్మూలించవచ్చు అంటూ కృష్ణ కుమారి అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago