Featured

DAV public school issue : నా ముగ్గురు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు… రెండు నెలలుగా సీసీటీవీ కెమెరాలకు పవర్ కట్ చేశారు… వాడిని ఉరి తీసి… ఆ ప్రిన్సిపాల్ కి ఎలాంటి శిక్ష వేయాలంటే : పేరెంట్ మమత

DAV public school issue : గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల పాప మీద స్కూల్ డ్రైవర్ అత్యాచారం. రెండు నెలలుగా పాపను వేదిస్తున్న ఆ డ్రైవర్ మరి కొంతమంది పిల్లలను కూడా ఇలాగే లైంగిక వేధింపులకు గురించేసాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపాల్ మాధవి కి డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి స్కూల్ లో కూడా టీచర్స్ మీద అజమాయిషి చేసేవాడని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్ ను అలాగే ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేసారు. ఇక స్కూల్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఉదంతాల మీద ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలిపారు.

వాడిని అక్కడిక్కడే ఉరి తీయాలి…. ఆ ప్రిన్సిపాల్ ను కూడా…

ఇక మమత అనే పేరెంట్ మాట్లాడుతూ తన ముగ్గురు పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు రోజూ స్కూల్లో ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతూనే ఉంటానని మమత చెప్పారు. ఇక రెండు నెలల నుండి స్కూల్లో ఉన్న సీసీ టీవీలన్నింటికి పవర్ కట్ చేశారని పిల్లలు చెబితే అందరు పేరెంట్స్ పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లో అడిగామని, సీసీ టీవీలను మార్చాలని అందుకే అలా చేశామని త్వరలో మారుస్తామని చెప్పారు అంటూ చెప్పారు మమత.

ఇక చిన్నారి ఘటన గురించి మాట్లాడుతూ ఒక స్కూల్ డ్రైవర్ అంత చిన్న పిల్లను అలా చేస్తాడని అనుకోలేం కదా అంటూ వాడిని బ్రతకనివ్వకూడదు, అక్కడిక్కడే ఉరి వేయాలి, వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఇలాంటి బుద్ధి ఎలా పుట్టిందో అర్థం కావడం లేదు అంటూ మాట్లాడారు. ఇక ఆ ప్రిన్సిపాల్ ను కూడా వదలకూడదు ఆమెకు జైలు శిక్ష వేయాలి. ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అంటే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ చెప్పారు. ఇక స్కూల్ గుర్తింపు రద్దు చేయడం మంచిదే కానీ మిగిలిన పిల్లల భవిష్యత్తు గురించి కూడా అలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటూ మమత అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago