Featured

Tiger Prabhakar : పులితో ఫైట్ చేసిన గ్రేట్ విలన్.. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా చివరి రోజుల్లో చూసుకునే వారు లేక..

Tiger Prabhakar : టైగర్ ప్రభాకర్.. ఓ సినిమాలో నిజంగా పులితో పోరాడిన నటుడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విలన్. పులంటేనే భయపడే జనాలున్న వేళ పులితోనే కొట్లాడిన గొప్ప నటుడు. ప్రభాకర్.. ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలు పోషించాడు. తన అద్భుత నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. చిన్న వయసులోనే సినిమా రంగంలోకి వచ్చాడు ప్రభాకర్.. కెరీర్ ఆరంభం నుంచి విలన్ పాత్రలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీకారం సినిమాలో ఆయన చేసిన సాహసం అప్పట్లో సంచలనం అయ్యింది. ఈ సినిమాలో నిజంగానే పులితో ఫైట్ చేశాడు. అప్పటి నుంచి ప్రభాకర్ కాస్త.. టైగర్ ప్రభాకర్ గా మారిపోయాడు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ వ్యక్తిగత జీవితం మాత్రం కష్టల మయంగా సాగింది.

ప్రభాకర్ తెలుగుతో పాటటు కన్నడ, తమిళ, మరికొన్ని ఇతర భాషల్లో కలుపుకుని 300 సినిమాల్లో నటించాడు. కొంత కాలం బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి సత్తా చాటాడు. తెలుగులో టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సహా పలువురి సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. ఇక ఈయన వ్యక్తిగత జీవితం గురించి కాస్త తెలుసుకుందాం.. ప్రభాకర్ మూడు వివాహాలు చేసుకున్నాడు. 1985లో ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయమాలను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్ది కాలానికే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు.

అనంతరం 1995లో మరో వివాహం చేసుకున్నారు. పలు సీరియల్స్ లో నటించిన కన్నడ నటి అంజును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే వీరు విడిపోయారు. ఆ తర్వాత పభాకర్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. 2000 సంవత్సరంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పలు ఆరోగ్య సమస్యలకు తోడు ఆయనకు జాండిస్ వచ్చింది. 2001 మార్చి 25న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో నటించి.. ఎంతో గొప్పగా బతికిన ప్రభాకర్ చివరి రోజుల్లో ఎవరూ చూసుకునే వారు లేక ఆవేదనతో చనిపోయారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago