Featured

Krishna Vamsi : ప్రకాష్ రాజ్ కి, నాకు ఒకరి మీద ఒకరికి ఇరిటేషన్ వస్తుంది.. అవసరం కాబట్టి భరిస్తాను.. : కృష్ణ వంశీ

Krishna Vamsi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తుండిపోయే చిత్రాలు తీసిన దర్శకుడు. కుటుంబ కథా చిత్రాలు తీసినా, సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాలు తీసినా కృష్ణ వంశీ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. గులాబీ సినిమాతో మొదలయిన ప్రస్థానం సింధూరం, అంతఃపురం, సముద్రం, నిన్నేపెళ్లాడుతా, మురారి, ఖడ్గం ఇలా డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న కృష్ణ వంశీ చాలా రోజుల తరువాత మళ్ళీ రంగ మార్తాండా సినిమాతో రానున్నాడు.

ప్రకాష్ రాజ్ ను భరిస్తున్నా…

ప్రకాష్ రాజ్ కి అంతఃపురం, ఖడ్గం, సినిమాలతో గుర్తుండి పోయే పాత్రలు ఇచ్చిన కృష్ణ వంశీ ఆయనతో జరిగిన గొడవల గురించి స్పందించారు. ప్రకాష్ రాజ్, తాను భిన్న ధృవాలు అంటూ చెప్పాడు. ఆయన ఆలోచనలు, నా ఆలోచనలలో చాలా వత్యాసం ఉంటుందని చెప్పారు. చిన్న చిన్న గొడవలు ఇద్దరి మధ్య ఉన్నా కూడా ఎప్పుడూ మనసులు దూరం కాలేదని చెప్పారు కృష్ణ వంశీ. ఒకటీ రెండు రోజులు ఆ గొడవ ఉంటుంది, ఆ తరువాత నేనే వెళ్లి మాట్లాడుతా. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, ఆయనతో సినిమా నాకు అవసరం అందుకే నేనే వెళ్లి మాట్లాడి సర్దుబాటు చేసుకుంటాము.

మా గురువు ఆర్జీవి చెప్తుంటారు మనిషికి ఇంకో మనిషిని కనెక్ట్ చేసేది అవసరం, ఇష్టం మాత్రమే అని అవి రెండూ కూడా మన స్వార్థమే అంటూ చెప్పారు కృష్ణ వంశీ. నేను కూడా అది నమ్ముతాను, ఒకరి దగ్గరికి వెళ్ళాం అంటే ఒకటి వారిపై ఇష్టమైనా ఉండాలి లేదా అవసరమైనా ఉండాలి. అవి రెండూ కూడా నీ అవసరం, స్వార్థమే కదా అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago