Featured

Krishna Vamsi : ప్రభాస్ కి ఆ సినిమా వద్దని ముందే చెప్పినా… నా మాట వినలేదు…: కృష్ణ వంశీ

Krishna Vamsi : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయినా లేక సోషల్ మెసేజ్ అయినా కృష్ణ వంశీ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన కృష్ణ వంశీ గులాబీ, సింధూరం, సముద్రం, అంతఃపురం, నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నచ్చారు. ఖడ్గం వంటి సినిమా అయినా మొగుడు వంటి ఫ్యామిలీ డ్రామా అయినా కృష్ణ వంశీ స్టైల్ డిఫరెంట్. కానీ ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత కృష్ణ వంశీ ‘రంగ మార్తాండ’ సినిమాతో వచ్చి ఒక ఫీల్ గుడ్ సినిమా అనిపించుకున్నాడు.

ప్రభాస్ కి ఆ పాత్ర సూట్ అవ్వదు అంటే వినలేదు…

చాలా గ్యాప్ తరువాత సినిమా చేస్తున్న కృష్ణ వంశీ మళ్ళీ ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. అలా తన ముందు సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ప్రభాస్, కృష్ణ వంశీ కాంబినేషన్ లో వచ్చిన ‘చక్రం’ సినిమా డిజాస్టర్ అయింది, ప్రభాస్ అభిమానులకు సైతం ప్రభాస్ ఆ సినిమాలో నచ్చలేదు. ఇక ఆ సినిమా విషయంలో జరిగిన ఆసక్తికర అంశాలను కృష్ణ వంశీ పంచుకున్నారు. ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకున్నపుడు ప్రభాస్ తో యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నా, తనకు అలాంటివి సెట్ అవుతాయని అలా అనుకున్నా.

కానీ తాను మాత్రం డిఫరెంట్ సినిమా చేయాలనుకుంటున్నట్లు నాతో చెప్పాడు. యాక్షన్ వద్దు అంటూ చెప్పాడు. కల్ హో నా హో తరహా సినిమా చేద్దామని అనగా నేను వద్దన్నాను, మీకు సెట్ అవ్వదు అని చెప్పినా వినలేదు. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది అంటూ చక్రం కథ చెప్పగా ఓకే చేసాడు. ప్రభాస్ అభిమానులకు నచ్చదేమో అని కొంచెం యాక్షన్ సన్నివేశాలు కూడా పెట్టాము కానీ సినిమా సరిగా ఆడలేదు అంటూ అప్పటి విషయాలను చెప్పారు.

Bhargavi

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

4 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

7 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

7 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

8 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

10 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

10 hours ago