Krishna Vamsi : చాలా రోజుల గ్యాప్ తరువాత రంగ మార్తాండా సినిమాతో మళ్ళీ రాబోతున్న కృష్ణ వంశీ తన ముందు సినిమాల గురించిన విషయాలను విశేషాలను చెప్పారు. ‘గులాబీ’ సినిమాతో మొదలైన సినిమా ప్రయాణం నిన్నేపెళ్లాడుతా, సముద్రం, అంతఃపురం, ఖడ్గం, మురారి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తన సినిమాలలో సామాజిక అంశాలతో పాటు కుటుంబ విలువలను చూపేందుకు కృష్ణ వంశీ ఇష్టపడుతాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆశించినంత విజయాలను అందుకోలేని కృష్ణ వంశీ మళ్ళీ ఒక కొత్త కథాంశంతో సినిమా చేయబోతున్నాడు. ఇక తన గత సినిమా విశేషాలను ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
రాజమౌళి కి వెనుక కుటుంబం ఉంది… వర్మ చెప్పినా వినను…
కృష్ణ వంశీ సినిమాలు దాదాపు అన్ని సామాజిక అంశాలతో ముడిపడి ఉంటాయి. తన సినిమాల్లో సోషల్ అవేర్నెస్ అలాగే దేశాన్ని ప్రేమించడం వంటివి కనిపిస్తాయి. ప్రతి కథలోనూ ఏదోక మెసేజ్ ఇచ్చే కృష్ణ వంశీ ఈమధ్య సినిమాలను తగ్గించారు. ఇపుడున్న దర్శకులైన రాజమౌళి తదితరులు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తుంటే కృష్ణ వంశీ ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఇక దీన్ని గురించి మాట్లాడుతూ అప్పట్లో అలా ఇంటర్నేషనల్ వైడ్ సినిమా తీయాలనే ఆలోచన లేదని హిందీలో ‘శక్తి’ సినిమా చేసినా అది డిజాస్టర్ అయిందని చెప్పారు. ముంబై నగరం నచ్చలేదని అక్కడ పని ఉదయం 11 ఇంటికి మొదలవుతుంది చాలా లేజీగా ఉంటారు, ఎక్కువ ట్రాఫిక్, ఎక్కువ జనాలు అందుకే నాకు నచ్చలేదు అక్కడ సినిమా తీయాలనీ అనుకోలేదు. ఇక రాజమౌళి లాగా పాన్ ఇండియా సినిమాలు ఇంటర్నేషనల్ సినిమాలు తీయాలంటే అతని సక్సెస్ వెనుక అతని ఫ్యామిలీ ఉంది.
వెన్నెముక లాగా శోభు యార్లగడ్డ, రాఘవేంద్ర రావు, కీరవాణి ఉన్నారు వారిది ఒక గొప్ప సినర్జీ అంటూ చెప్పారు. ఇక రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ ఆయనకు అసిస్టెంట్ గా ఉన్నపుడు అవి గోల్డెన్ డేస్ అంటూ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వాళ్ళు ఉండేవాళ్ళం. నేను డైరెక్టర్ తేజ, రమణ, శివ నాగేశ్వరావు అలా ఒక్కోరకం ఒక్కొక్కరు. ఇక వర్మ గారు చెప్పే విషయాలకు నేను నా పీత బ్రెయిన్ తో వాదించేవాడిని. అయితే ఆయన చెప్పాడంటే చేయడమే కాదని చెప్పను కానీ వాధన జరిగేది. నాకిప్పటికీ ఆయన ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటిస్ వంటి జాతిని జాగృతం చేయడానికి ప్రతి తరం లో పుట్టే ఒక గొప్ప వ్యక్తిలా అనిపిస్తారు అంటూ గురువు గురించి చెప్పారు కృష్ణ వంశీ.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…