Kona Venkat : జగన్ నిజం, చంద్రబాబు అపద్దం, పవన్ కళ్యాణ్ అమాయకత్వం : కోన వెంకట్

Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. ఇక సమకాలిన సినిమా ఇండస్ట్రీ విషయాలను అలాగే రాజకీయాల గురించి కోన తన అభిప్రాయాలను చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి తెలిపారు. రాజకీయంగా వైసీపీ పార్టీతో ఉన్న కోన వెంకట్ పవన్ తో బంధం గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు.

జగన్ నిజం… పవన్ కళ్యాణ్ అందరినీ నమ్మేసి మోసపోతాడు…

పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా అప్పటి నుండి బాగా తెలుసు, అప్పటి నుండి నాకు పవన్ కి మధ్య స్నేహం మొదలయింది. అయితే ‘గుడుంబా శంకర్’ సమయంలోనే నాగబాబు గారు పరిచయం ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ ను సొల్ మేట్ అని పిలుస్తాను. అదేదో ఫ్యాషన్ కోసం నేను అలా పిలవను నాకు నిజంగా మా ఇద్దరి భావాలు కలిసాయి అనిపించింది కాబట్టే అలా పిలుస్తాను. పవన్ అంటాడు ఒక చిన్న పరిచయం కూడా విధి రాసిపెట్టుంటే జరుగుతుంది అని మనం కలవడం కూడా విధే అని చెప్పాడు. ఇక పవన్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు నాకు ఎప్పటి నుండో తెలుసు.

పవన్ ఎపుడూ అంటుంటాడు నా పని ఇది కాదు నేను ఇంకేదో చేయాలి అని చాలా సార్లు అంటుండేవాడు. అయితే తాను రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన మా మధ్య స్నేహం పోదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో జగన్ వాస్తవం, చంద్రబాబు అపద్ధం, పవన్ కళ్యణ్ అమాయకుడు అని తాను తొందరగా ఎవరినైనా నమ్మేస్తాడు నమ్మి మోసపోయాక మళ్ళీ మోసపోయానని బాధపడతాడు. అసలు అంత త్వరగా నమ్మడం ఎందుకు మళ్ళీ బాధపడటం ఎందుకు ఆ విషయం నేను ఇంటర్వ్యూలో చెబితే దాని ఇంకోలాగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను ట్రోల్స్ చేసారు అని కోన అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago