Krishna Vamsi: కృష్ణవంశీ తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణవంశీ గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు.
ఇకపోతే తాజాగా ఈయన రంగమార్తాండ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రకాష్ రాజ్ కీలకంగా నటించినటువంటి ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న కృష్ణ వంశీ తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఈయన చిరంజీవి గారితో తనకున్న అనుబంధం గురించి కూడా బయటపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవిని తాను అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటానని ఆయన కూడా తనని ఒక తమ్ముడుగా భావిస్తారని కృష్ణవంశీ వెల్లడించారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో ఒక యాడ్ షూటింగ్ సమయంలో మాట్లాడుతూ అన్నయ్య తనకి ఇష్టమైన వారికి కారును బహుమానంగా ఇస్తారని తమాషాగా చెప్పాను. నేను ఈ మాటలు అన్న కొద్ది రోజులకు తనని ఇంటికి రమ్మని ఫోన్ చేశారు.
ఇంటికి వెళ్ళగానే తనకు కారు గిఫ్ట్ గా ఇస్తున్న విషయాన్ని తెలిపారు. ఇలా అన్నయ్య చెప్పేసరికి తాను ఒకసారిగా ఆశ్చర్యపోయానని అయితే తాను ఇచ్చే బహుమతి వద్దని చెబుతున్నప్పటికీ మెగాస్టార్ మాత్రం అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నావు మరి ఈ అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ తీసుకోవా అని చెప్పడంతో చాలా మొహమాటంగా ఆ కారును బహుమానంగా తీసుకున్నానని తెలిపారు. అయితే ఆ బహుమానమే తన ప్రాణాలను కాపాడిందని ఇప్పుడు తాను ప్రాణాలతో ఉన్నానంటే ఆ కారే కారణమని తెలిపారు. ఆ కారులో ఒకరోజు నందిగామ వెళ్లి వస్తుండగా పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం డామేజ్ అయినప్పటికీ తను మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డానని ఈ సందర్భంగా ఆ కారు గురించి కృష్ణవంశీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…