Srinu Vaitla:. శ్రీను వైట్ల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు.గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సీను వైట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుని దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి దూకుడు ప్రదర్శించాయి.
ఇలా సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈయనకు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా నుంచి వరుస అపజయాలు వెల్లువెత్తాయి. ఈ విధంగా వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో ఈయనకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే గత కొంతకాలం నుంచి ఈయన విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమా సీక్వెల్ ద్వారా రాబోతున్నారని వార్తలు వచ్చాయి.
ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు కూడా శీను వైట్లను పూర్తిగా పక్కన పెట్టేశారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేక సమస్యలు నడుమ చిక్కుకున్న శ్రీను వైట్ల తాజాగా మరొక సమస్య ద్వారా వార్తల్లో నిలిచారు. శీను వైట్ల భార్య రూపా గురించి మనకు తెలిసిందే. ఈమె శ్రీను వైట్ల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించేది.
ఈ విధంగా వీరిద్దరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీను వైట్ల రూపా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని అయితే తాజాగా ఈమె విడాకుల కోసం నాంపల్లి కోర్టుకు అప్లై చేశారని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఇక ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు ఒకవైపు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న శీను వైట్లకు ఇలా విడాకుల సమస్య రావడం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…