Categories: FeaturedMovie News

Krishnam Raju : కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలకు, ప్రభాస్ కు ఇంకా పెళ్లి చేయకపోవడానికి కారణం అదే : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Krishnam Raju : తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రిగా చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు స్వర్గస్థులు అయిన విషయం తెలిసిందే. పోస్ట్ కోవిడ్ అనారోగ్య కారణాలతో కృష్ణంరాజు ఏఐజీ హాస్పిటల్ లో మరణించారు. సెప్టెంబర్ 11 ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1966 లో ‘చిలక గోరింక’ సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించిన కృష్ణంరాజు 60 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ను కొనసాగించాడు. ఇప్పటి వరకు 185 చిత్రాలకు పైగానే ఆయన నటించారు. హీరోగానే కాకుండా, విలన్ పాత్రలలోనూ, సహాయక పాత్రలలోనూ నటించి మెప్పించారు.

తీరని కోరికగా మిగిపోయిన ప్రభాస్ పెళ్లి…

కృష్ణంరాజు గారి జీవితంలో ఏదైనా తీరని లోటు ఉంది అంటే ప్రధానంగా అది ప్రభాస్ పెళ్లి అని సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చాలా సార్లు కృష్ణంరాజు గారు ప్రభాస్ కు పెళ్లి చేసి వారి పిల్లలతో ఆడుకోవాలని ఉంది అని ఆయన చెప్పినట్లు తెలియజేసారు. ప్రభాస్ జీవితంలో ఏదైనా తప్పు చేసాడు అంటే ఇదే అని ఆయన చెప్పారు. ‘బాహుబలి’ సినిమా సమయంలోనే ప్రభాస్ కు పెళ్లి చేయాలని చూశారనీ కానీ ప్రభాస్ బాహుబలి తరువాత అంటూ చివరకు బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ కూడా అయిపోయిందని చెప్పారు. ప్రభాస్ ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యం చేశారేమోనని చెప్పారు. ప్రభాస్ ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా వాళ్లని చూడటానికి కృష్ణంరాజు గారు ఉండరు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభాస్ తో పాటు కృష్ణం రాజు గారి ముగ్గురు కుమార్తెలకు కూడా పెళ్లి చేయలేదని అది కూడా ఆయనకు తీరని లోటుగా అభివర్ణించారు. వారికి పెళ్లి చేయకపోవడానికి గల కారణం గురించి ప్రశ్నించగా… అది అలా జరిగిపోయిందని, ఆయన వారికి పెళ్లి చేయాలనే అనుకున్నారు కాకపోతే అమ్మాయిలు ముగ్గురు మంచి చదువులు చదివి సంపాదిస్తున్నారు. వారికి తగ్గ సంబందాలు కూడా కుదరాలి, ఏది పడితే అది చేయలేరు కదా… కానీ అంతలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎవరూ ఊహించలేరు అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago